నీ దేవుడు, నీ సమాజం, నీ బతుకు, అన్నీ అబద్ధాలే | SOCRATES | Anukula Vedam || Telugu Podcast
Author Name:Anukula Vedam
Youtube Channel Url:https://www.youtube.com/@anukulavedam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=EzMo5IKicSE
Transcript:
(00:05) ఈ పాడ్కాస్ట్ వింటిన మీరు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుందాం అని వచ్చారు కదా మీ నాలెడ్జ్ ని ఇంకాస్త పెంచుకుందాం అనుకుంటున్నారు కదా సరిగ్గా అక్కడే ఉంది మీలో దాగున్న పెద్ద బొక్క తెలుసుకోవడం అనేది ఈ రోజుల్లో ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మీ బుర్ర ఇప్పటికే ఈ సొసైటీ రిలీజియన్ పేరెంట్స్ ఇంటర్నెట్ కుమ్మరించిన చెత్తతో నిండిపోయి ఒక డంపింగ్ యార్డ్ లా తయారైింది.
(00:34) కానీ మీరు దాన్నే జ్ఞానం అనుకొని మోస్తున్నారు. మీ అహంకారాన్ని అలంకరించుకోవడానికి మీరు వాడుకుంటున్న మేకప్ కిట్ పేరే నాలెడ్జ్ ఈ సమాజం ఒకే ఒక నియమం మీద నడుస్తుంది. మీకు ఏమి తెలీదు మాకు అన్నీ తెలుసు కాబట్టి అన్ని మోసుకొని మేము చెప్పినట్లు విను అని రాజకీయ నాయకుడు నీకు భయాన్ని నమ్మి రక్షణ ఇస్తాను అంటాడు మతం నీకు పాపాన్ని నమ్మి పుణ్యం ఇస్తాను అంటది కార్పొరేట్ కంపెనీలు నీకు ఆత్మన్యూనత భావాలు నమ్మి వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ ని మీకు అండగడదాం అనుకుంటది.
(01:03) ఈ మొత్తం వ్యాపారం నడవాలంటే జనాల బుర్రలో మాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది మాకుొక నాలెడ్జ్ ఉంది అన్న భ్రమ ఉండాలి. సాక్రటీస్ గురించి ఒక విచిత్రమైన విషయం ఏంటంటే అతను తన జీవితంలో ఒక్క పుస్తకం కూడా రాయలేదు. ఎందుకంటే అతను ఏమనేవాడంటే సత్యం అనేది అక్షరాల బంది అయ్యేది కాదు అది ప్రశ్నించే గొంతులో ఉంటది అని మనకి సోక్రటీస్ గురించి తెలిసిందంతా కూడా అతని శిష్యుడు ప్లేటో రాసింది.
(01:27) ఏథెన్స్ లో అందరూ ఏమనుకునేవారంటే సోక్రటీస్ కంటే తెలివైన మేధావి అసలు ఏథెన్స్ లో ఎవ్వడూ లేడు అని. సాధారణంగా ఎవరైనా మనల్ని అలా పొగిడితే మనం ఇచ్చే బిల్డప్ మరి అంత ఇంత కాదు ఫ్లెక్సీలు కట్టి పూలదండలు వేయించుకొని స్టేటస్లు పెట్టుకొని అబ్బో చాలా చేస్తాం కానీ సోక్రటీస్ ఆ పొగడ్తల్ని నమ్మలేదు ఎందుకంటే తనక అసలు దేని గురించి ఏమి తెలియదు అన్న కఠోర సత్యం చాలా స్పష్టంగా తెలుసు తనకి దీన్నే సాక్రటిక్ ఇగ్నోరెన్స్ అని పిలుస్తారు.
(01:55) నాకు తెలుసు అని గిరిగీసుకున్న నీ బుర్రలోకి సత్యం ఎప్పటికీ రాదు. ఒక నిండిపోయిఉన్న గ్లాస్ లో నువ్వు అమృతం పోసిన అది కిందే పడతది. ముందు ఆ గ్లాస్ ఖాళీ అవ్వాలి. నాకు ఏమి తెలియదు అని ఒప్పుకోవడానికి చాలా గట్స్ కావాలి. అయితే ఏమి తెలియకపోవడం గొప్ప విషయం ఎలా అవుతది అని మీకు డౌట్ రావచ్చు కానీ దాని అర్థం అది కాదు ఇక్కడ లాజిక్ జాగ్రత్తగా వినండి.
(02:18) సాక్రటీస్ చెప్పింది ఏంటంటే మీకు నిజంగా ఏదైనా తెలుసు అనుకుంటే ముందు మీ గురించి మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి. ఈ నమ్మకం నాలో ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు నమ్మే పాలిటిక్స్ మీ సొంత విశ్లేషణ నుంచి వచ్చిందా లేదా మీ నాన్నగారు చెప్పారని గుడ్డిగా ఫాలో అవుతున్నారా మీరు చదివే చదువు మీరు చేసే ఉద్యోగం ఇవన్నీ మీరు ఎంచుకున్నవా లేదా పక్కింటోడు ఏమనుకుంటాడో అన్న భయంతో సొసైటీ మీ మెథడ్లో రుద్దినవా ఇక మీరు నమ్మే రిలీజియన్ దాన్ని మీరు ఎప్పుడైనా లోతుగా ఎగ్జామిన్ చేశారా అసలు దేవుడు అంటే ఏంటి అని ఏనాడైనా మీ అంతట మీరు వెతికారా మీరు సక్సెస్ అంటే ఒక కారు ఇల్లు బ్యాంక్
(02:49) బ్యాలెన్స్ అని డిఫైన్ చేశారు కదా అసలు ఆ డెఫినిషన్ నిజంగా మీదేనా ఒకవేళ నువ్వు ఇండియా ఇండియాలో కాకుండా ఇంకో దేశంలో పుట్టుంటే నీ దేవుడు మారేవాడు నీ శత్రువు మారేవాడు నువ్వు తినే తిండి కట్టే బట్ట నమ్మే సిద్ధాంతం మొత్తం మారిపోయేది అంటే దాని అర్థం ఏంటి నీకంటూ సొంతంగా ఏమీ లేదు. నీ ఆలోచన నీది కాదు నీ నమ్మకం నీది కాదు నువ్వు జస్ట్ ఒక ప్రోగ్రామడ్ మెషిన్వి కానీ నువ్వు అద్దం ముందు నిలబడి ఇది నా క్యారెక్టర్ ఇవి నా వాల్యూస్ అని నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకొని విర్రవీకుతున్నావ్.
(03:18) ఎంత హాస్యస్పదం కదా ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎవరైనా అన్కంఫర్టబుల్ గానే కదా ఫీల్ అవుతారు ఎందుకంటే మీరు ఇన్నేళ్లుగా బ్రతుకుతున్న జీవితం మొత్తం ఒక అబద్ధం అని ఒప్పుకోవాల్సి వస్తది. సరిగ్గా సాక్రటీస్ కి కావలసింది కూడా అదే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా మీరు ఎవరితోనైనా ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తారు సత్యం తెలుసుకోవడానికా కాదు నేను కరెక్ట నువ్వు రాంగ్ అని నిరూపించుకొని నీ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి కానీ సాక్రటీస్ ఎవ్వరితోనూ ఆర్గ్యుమెంట్లు పెట్టుకునేవాడు కాదు అతను ఒక అద్భుతమైన మెథడ్ డెవలప్ చేశాడు దాన్ని ఎలంచెస్ అంటారు. ఎలంచెస్
(03:52) అంటే కత్తి తీసుకొని పోరాటం కాదు. ఒక మనిషి చెప్పే సోదిని ప్రశాంతంగా విని వాళ్ళ లాజిక్ లో ఉన్న బొక్కల్ని వాళ్ళకే చూపిస్తూ ఒక సింపుల్ క్వశ్చన్ వేయడం వాళ్ళ ఆన్సర్ లోనే వాళ్ళ మూర్ఖత్వాన్ని లాగి నడి వీధిలో నిలబడటం ఒక మిలిటరీ జనరల్ వచ్చి వెనకడుగు వేయకపోవడమే ధైర్యం అంటే అని అన్నాడు దానికి సాక్రటీస్ ఏమని అడిగాడో తెలుసా అయితే రేపు గెలవడానికి వ్యోహాత్మకంగా ఈరోజు వెనకడుగు వేస్తే అది పిరికితనం అవుతుందా అని అడిగాడు ఆ జనరల్ దగ్గర ఆన్సర్ లేదు.
(04:22) సో సాక్రటీస్ ఎవ్వరితోను ఆర్గ్యూ చేసేవాడు కాదు అతను పని కట్టుకొని ఎవ్వరికీ లెక్చర్లు ఇచ్చేవాడు కాదు అతను కేవలం క్వశ్చన్స్ మాత్రమే అడిగేవాడు నీకు తెలుసు అంటున్నావు కదా నువ్వు దేన్నైతే నాకు తెలుసు అంటున్నావో అది నీకు ఎందుకు తెలుసో ఎలా తెలుసో నిరూపించు అనేవాడు అంతే మనిషి తన బట్టలు తానే ఇప్పుకున్నట్టు తన అహంకారం తన అజ్ఞానం తానే చూసుకొని రోడ్డు మీద బట్ట బయలయ్యేవాడు.
(04:44) నిన్ను నువ్వు ఎప్పుడైనా ఇలా ఎగ్జామిన్ చేసుకున్నావా నువ్వు ఒక అమ్మాయి లేదా అబ్బాయి వెనక పిచ్చి కుక్కలా తిరుగుతూ దాన్ని ప్రేమ అంటున్నావు కదా అది ప్రేమ లేదా నీ శరీరంలో జరుగుతున్న కెమికల్ రియాక్షన్ నీకు అసలు దాని గురించి ఏమన్నా క్లారిటీ ఉందా నువ్వు ఉదయం లేచి రాత్రి వరకు గాడిదిలా కష్టపడుతున్నావ్ దేనికోసం నువ్వు అనుకుంటున్న ఆ సక్సెస్ కోసం కదా కానీ నువ్వు దేన్నైతే సక్సెస్ అంటున్నావో ఆ సక్సెస్ కి ఇచ్చిన డెఫినిషన్ నీదా లేదా పక్కింటోడు కొన్న కార్ చూసి నీకు నువ్వే పుట్టించుకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ్ నీ నమ్మకాలు నీ కోరికలు నీ లక్ష్యాలు
(05:15) ఏవి నీవి కావు. నువ్వు ఒక అద్దికి తెచ్చుకున్న బతుకుని బతుకుతున్నావ్. ఈ నిజం ఒప్పుకోవడానికి నీ అహంకారం అడ్డొస్తుంది. ఇలా నిజాలు చెప్తే ఎవ్వడికైనా మండిపోద్ది. సరిగ్గా ఈ పని చేసినందుకే ఏథెన్స్ సాక్రటీస్ ని బ్రతకనివ్వలేదు. నిద్రపోతున్న సమాజాన్ని లేపితే వాళ్ళు నీకు దండేసి దండం పెడతారు అనుకుంటున్నావా నిన్ను నడి రోడ్డులో ఊరితేస్తారు.
(05:37) సొంతంగా ఆలోచించినవరాని పొలిటీషియన్స్ ధైర్యం అంటే ఏంటో తెలియని జనరల్స్ గుడ్డి నమ్మకాలని అమ్ముకునే మతాధికారులు ఇలా సొంతంగా ఆలోచించడం రాని వాళ్ళందరికీ ఈ సోక్రటీస్ ని చూసి భయం పట్టుకుంది. ఎందుకంటే మనుషులు గాని ఆలోచించడం మొదలపెడితే ఈ వ్యవస్థ నడవదు, మతం నడవదు రాజకీయాలు నడవవు గొర్రెలు గొర్రెల్లానే ఉండాలి. అందుకే అతన్ని కోర్టికి లాకెళ్ళారు అతని మీద పెట్టిన కేస ఏంటో తెలుసా యువతను పాడు చేస్తున్నాడు దేవుళ్ళని అవమానిస్తున్నాడు అని అంటే వాళ్ళ దృష్టిలో బహుశా మీ దృష్టిలో కూడా ఒక మనిషి సొంతంగా బుర్ర పెట్టి ఆలోచించడం అంటే వాడు చెడిపోయినట్టే సో సాక్రటీస్ కి మరణ శిక్ష విధించారు.
(06:14) నిజానికి ఆ శిక్ష నుండి కావాలంటే సోక్రటీస్ అక్కడ నుంచి సునాయాసంగా పారిపోగలిగేవాడు కానీ పారిపోలేదు ఎందుకు ఎందుకంటే భయపడి పారిపోవడం అంటే ఈ మాంసపు ముద్దైన శరీరాన్ని కాపాడుకోవడం కోసం తన ఆత్మని అమ్ముకున్నట్టే అని తనకు తెలుసు మేబీ మనమైతే కచ్చితంగా ప్రాణాలే ముఖ్యమం అనుకొని పారిపోయి ఉండేవాళ్ళేమో కానీ అతను ఆ పని చేయలేదు ఒక చిరునవ్వుతో హెమ్లాక్ అనే విషాన్ని తాగి చచ్చిపోయాడు.
(06:38) ఇప్పుడు ఒక నిమిషం ఈ కథను పక్కన పెట్టి మీ గురించి మీరు అడగండి. ఈరోజు మీరు దేన్నైనా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారా ఒక ఒపీనియన్ ఒక బిలీఫ్ లేదా మీరు తీసుకున్న ఒక డెసిషన్ ఆ నమ్మకాన్ని మీరు ఏనాడైనా లోతుగా బుర్రపెట్టి పరీక్షించారా లేదా సొసైటీ నుంచి ఒక బిచ్చగడిలా సింపుల్ గా రిసీవ్ చేసుకొని అదే మీ సొంత ఆస్తి అన్నట్టు బ్రతికేస్తున్నారా? సోక్రటీస్ చనిపోయే ముందు కోర్టులో ఆ జడ్జ్ కళ్ళలో చూస్తూ ఒక మాట చెప్పాడు.
(07:04) ద అన్ఎగజమడ్ లైఫ్ ఇస్ నాట్ వర్త్ లివింగ్ దీని అర్థం ఏంటో తెలుసా నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేని జీవితం బ్రతికిన చచ్చినట్టే లెక్క అతను సత్యం కోసం బ్రతికాడు కాబట్టే చావుకు కూడా భయపడలేదు అలా కానప్పుడు నువ్వు ఇంకో వంద ఏళ్ళు బ్రతికిన ఆ బ్రతుకు అసలు ఏమన్నా అర్థం ఉందా నువ్వు వేసుకున్న బట్టలు నీవి కావు నువ్వు చదువుతున్న చదువు నీది కాదు నువ్వు చూపిస్తున్న ప్రేమ నీది కాదు నీ కోరికలు నీవి కావు ఎవడో రాసిన స్క్రిప్ట్ కి నువ్వు జస్ట్ యాక్ట్ చేస్తున్నావ అంతే అందులో ఏ ఒక్కటైనా 100 శాతం నీది అని గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలవా చెప్పలేదు కానీ ఆ చెప్పలేను అన్న నిజాన్ని
(07:37) ఒప్పుకోవడానికి చాలా గట్స్ కావాలి. ఆ గట్స్ నీలో ఉన్నాయా ఒకవేళ ఉంటే పై పైన ఆలోచించడం మానేసి నిజమైన విచారణ మొదలుపెట్టు లేదు నేను అలా భయపడుతూనే మిగతా జీవితం కూడా బ్రతికేస్తా అబద్ధాన్ని మోస్తూనే చచ్చిపోతా అంటే నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని మోటివేషనల్ వీడియోలు చూసినా అది కేవలం నీ బానిసత్వానికి వేస్తున్న పాలిష్ మాత్రమే
No comments:
Post a Comment