Lord Krishna's 2 Rules for Ultimate Mind Control
Author Name:Telugu Books
Youtube Channel Url:https://www.youtube.com/@telugubooks1031
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fI8LjLh_Tjo
Transcript:
(00:01) శ్రీకృష్ణుడు రెండు విషయాలను చెప్పారు. ఒకటి ఇంద్రియ నిగ్రహం రెండవది మనసును ఆత్మ యందు లగ్నం చేయడం మొదటిది బాహ్యంగా చేయాల్సింది రెండవది అంతర్గతంగా చేయాల్సిన పని ముందు ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటే బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది. బయట ఇంద్రియాలను నిగ్రహిస్తే సరిపోదు లోపల మనసును కూడా ఆత్మ యందు లగ్నం చేస్తేనే గాని బుద్ధి స్థిరంగా ఉండదు అని అర్థం.
(00:29) కాబట్టి ఇంద్రియములు అదుపులో ఉండాలి వాసనలు పోవాలి బుద్ధి స్థిరంగా ఉండాలి మనసు ఆత్మ యందు లగ్నం కావాలి అప్పుడే వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు ఇంద్రియ నిగ్రహము నిరంతర సాధన శాస్త్రజ్ఞానము సత్సంగము వీటితో వస్తుంది ఇవి సాధిస్తే బుద్ధి స్థిరంగా ఉంటుంది మనస్సు ఆత్మలో లీనమవుతుంది అప్పుడే పరమానందం కలుగుతుంది కాబట్టి అన్నింటికంటే ఇంద్రియ నిగ్రహం ముఖ్యమని చెబుతున్నాడు పరమాత్మ ఎందుకంటే ఈ ఇంద్రియములు బాగా శాస్త్రజ్ఞానము బుద్ధి కలవాడిని కూడా పడగొడతాయి.
(01:06) ఇంద్రియములు రథానికి కట్టిన గుర్రాల వంటివి గుర్రాలు తమ దారిన తాము రథాన్ని లాక్కుపోతుంటే రథం గోతుల్లో ప్రయాణం చేస్తుంది. ప్రమాదానికి గురవుతుంది. అలాగే ఇంద్రియాలు బుద్ధి చెప్పినట్లు వినకుండా తమ దారిన తాము పోతూ ఉంటే వాడుఎన్నటికీ పరమాత్మను తెలుసుకోలేడు. ఇంద్రియములను వశంలో ఉంచుకుంటే వాడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. కాబట్టి సాధకుడు ఇంద్రియములను తన వశంలో ఉంచుకోవాలి అవి తాను చెప్పినట్లు నడుచుకునేలా చేయాలి ఇవి సాధించడానికి ఏమి చేయాలి ధ్యానం చేయాలి.
(01:40) ముందు మనస్సు పరమాత్మ యందు ఉంచాలి. పరమాత్మ గురించి ఆలోచించాలి. ముందు సగుణారాధనతో మొదలుపెట్టి ఏదో ఒక రూపంలో ఉన్న విగ్రహాన్ని పూజించి ఆ తరువాత ఆ విగ్రహమును కూడా వదిలిపెట్టి నిర్గుణ ఆరాధన చేయాలి దానిని ధ్యానం అంటారు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసును పరమాత్మ యందు లగ్నం చేయాలి అప్పుడు మోక్ష ప్రాప్తి కలుగుతుంది
No comments:
Post a Comment