ఇంట్లో మాటా-మర్యాద: పిల్లలతో ఎలా ఉంటున్నారు? | Family Etiquette: How to treat children?
Author Name:శ్రీరవీంద్ర జ్యోతిషాలయంGURUMANCHI RAJENDRA SHARMA
Youtube Channel Url:https://www.youtube.com/@SRIRAVINDRAJYOTISHALAYAMS
Youtube Video URL:https://www.youtube.com/watch?v=sybCTIuu6Gg
Transcript:
(00:00) అందరికీ నమస్కారం శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మ గారు మన రోజువారి జీవితంలో జరిగే చాలా మామూలు సంఘటనల్లోంచి అద్భుతమైన జీవిత పాఠాలను మనకు అందిస్తారు. ఈరోజు మనం ఆయన రాసిన ఇంట్లో మాట మర్యాద అనే ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ మనలో చాలా మందికి తెలిసినట్టు అనిపించొచ్చు. కానీ దీని వెనుక ఉన్న సందేశం మాత్రం చాలా లోతైనది.
(00:25) ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. ఎప్పుడైనా ఆలోచించారా మనల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళ మీద అంటే మన కుటుంబ సభ్యుల మీదే మనం ఎందుకు కొన్నిసార్లు అంత కఠినంగా ప్రవర్తిస్తాం మన కోపం చిరాకు అంతా వాళ్ళ మీదే ఎందుకు చూపిస్తాం? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా ఈ కథలో దొరకొచ్చేమో చూద్దాం రండి. సరే ఇక కథలోకి వెళితే ఒకానొక సాయంత్రం ఒక తల్లి వంటగదిలో రాత్రి భోజనం కోసం హడావిడిగా పనులు చేసుకుంటుంది.
(00:51) చాలా బిజీగా ఉంది. ఇంతలో ఆమె ఆరేళ్ల కొడుకు తన చేతుల్ని వెనక్కి పెట్టుకొని అమ్మకు ఏదో సర్ప్రైజ్ ఇద్దామని నెమ్మదిగా అడుగులో అడుగుేసుకుంటూ ఆమె వెనక్కి వస్తున్నాడు. ఆ పనుల హడావిడిలో ఉన్న ఆ తల్లి తన కొడుకు వెనకాలే ఉన్నాడని అస్సలు గమనించలేదు. సడన్ గా వెనక్కి తిరిగింది అంతే ఒక్క క్షణం ఇద్దరు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోబోయారు.
(01:18) అదృష్ట వసతు ఆమె వెంటనే తేరుకొని బాబును కూడా పట్టుకుంది. కానీ ఆ భయంలో ఆ టెన్షన్ లో తన మీద తను కంట్రోల్ కోల్పోయింది. ఆ క్షణంలో ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి కోపంతో గట్టిగా ఇక్కడేం చేస్తున్నావ్ బయటకు నడు అని అరిచేసింది. అంతే ఆ పసివాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కళ్ళనిండా నీళ్ళతో మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
(01:43) అమ్మ అన్న ఆ మాటలు వాడి సున్నితమైన మనసుని గాలిపరిచాయి. వంట పని అంతా అయిపోయాక ఆమె ప్రతిరోజు లాగే పూజ గదిలో ధ్యానం చేసుకోవడానికి కూర్చుంది. కానీ ఎందుకో ఆ రోజు తన మనసు కుదురుగా లేదు. కొడుకుని అన్న మాటలే గుర్తొస్తున్నాయి. అప్పుడు ఆమె అంతరాత్మ తనతో మాట్లాడటం మొదలు పెట్టింది. ఇక్కడ చూడండి ఈ వైరుధ్యం ఎంత ఆలోచింపజేస్తుందో తన అంతరాత్మ ఇలా నెలీసింది.
(02:07) బయటి వాళ్ళతో ఎంత మర్యాదగా ఎంత ఓపికగా మాట్లాడతావ్ మొన్న ఆఫీస్ లో నీ ఫ్రెండ్ చేతిలోంచి వేడి టీకప్పు జారి నీ మీద పడినా అయ్యో పర్వాలేదు ఇట్స్ ఓకే అన్నావ్. మరి నిన్నే ప్రాణంలా చూసుకునే నీ సొంత కొడుకు దగ్గరికి వచ్చేసరికి ఆ మర్యాద ఆ ఓపిక ఎక్కడికి పోయాయి? తన మనసు ఇలా అడుగుతోంది అసలు నీ కొడుకు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో కనుక్కున్నావా ఆ చిన్ని గుండె ఎంత నొచ్చుకుందో ఒక్కసారైనా ఆలోచించావా రోజు దేవుడి మీద భక్తితో ధ్యానం చేస్తున్నావు సరే కానీ ఆ పసి హృదయంలో కూడా ఆ దైవం ఉంటాడని నీకు తెలియదా ఈ ఆలోచనలు ఆమెను ఒక్కసారిగా కుదిపేసాయి. ఇక ఆమె ధ్యానంలో
(02:45) కూర్చోలేకపోయింది. తాను చేసిన తప్పుకు సిగ్గుపడుతూ బాధతో లేచి వంటగదిలోకి వెళ్ళింది. వెళ్తే అక్కడ నేల మీద కొన్ని ఎర్రని పసుపు తెలుపు గులాబీలు పడిన్నాయి ఆ పూలను చూడగానే ఆమె గుండె తరుక్కుపోయింది. వెంటనే కొడుకు కోసం వెతికింది. వాడు బెడ్రూమ్లో మంచం మీద నిద్రపోతున్నాడు. దగ్గరికి వెళ్లి చూస్తే వాడి బుగ్గల మీద కన్నీళ్లు ఆరిపోయి చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
(03:16) ఆ దృశ్యం చూసి ఆమె హృదయం ద్రవించిపోయింది. చాలా ప్రేమగా తన బాబును నిద్రలేపింది. కొడుకు లేవగానే ఏమి మాట్లాడకుండా తల్లి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ స్పర్శకు ఆమె మనసు శాంతించింది. కొడుకుని దగ్గరకు తీసుకుని నిన్ను అలా కోపంగానే ఉండకూడదు నాన్న కింద పడతావేమో అనిన్న భయంతో ఆ టెన్షన్లో అలా అరిచాను నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అని చెప్పింది.
(03:43) ఆ మాటలకు వాడు కూడా నాకు నువ్వంటే చాలా ఇష్టంఅమ్మ అంటూ తల్లిని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరు కాసేపు అలానే ఒకరినొకరు ఓదార్చుకున్నారు. అప్పుడు ఆమెకు ఆ గులాబీల విషయం గుర్తొచ్చి కిచెన్ లో కొన్ని గులాబీలు కనిపించాయిరా చాలా బాగున్నాయి ఎక్కడివి అవి అని అడిగింది. అప్పుడు ఆ బాబు ఎంతో అమాయకంగా స్వచ్ఛమైన ప్రేమతో చెప్పిన సమానం ఇది అమ్మ నీకు గులాబీలు అంటే ఇష్టం కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూసాయి అడిగి నీకోసమే తెచ్చాను.
(04:12) ఆ మాటలు విన్న తల్లి కళ్ళలో నీళ్లు తిరిగాయి. తను కోపంతో చిరాకుతో తిరస్కరించింది ఒక స్వచ్ఛమైన ప్రేమను అని అప్పుడు గ్రహించింది. చూశారు కదా ఈ కథ కేవలం ఆ తల్లి కొడుకుల మధ్య జరిగింది కాదు ఇది మనందరి కథ. మనలో ప్రతి ఒక్కరి కథ. శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మ గారు ఈ చిన్న కథ ద్వారా మనకొక చాలా శక్తివంతమైన సందేశాన్ని అందిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
(04:38) ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు మూడు మొదటిది మన ప్రవర్తన బయటి వాళ్ళతో ఎంత మర్యాదగా ఉంటామో మన ఇంట్లో వాళ్ళతో కూడా అంతే మర్యాదగా గౌరవంగా ఉండాలి. రెండవది మన స్పందన ముళ్ళలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా మనం గులాబీలా చిరునవ్వుతో ప్రేమతో స్పందించాలి. ఇక మూడోది మన అవగాహన మన వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లను కాదు వాటి వెనుకున్న ప్రేమను మనం చూడాలి.
(05:07) మరి ఈ కథ విన్న తర్వాత ఒక్క క్షణం మనసులో ఆలోచిద్దాం మనం మన ప్రియమైన వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నాం మన మాటలు మన చేతులు ముళ్ళలా గుచ్చుకుంటున్నాయా లేక గులాబీ పువ్వుల వాళ్ళకి ఆనందాన్ని పంచుతున్నాయా ఈరోజు నుంచయనా మన ప్రవర్తనను మార్చుకునే ప్రయత్నం చేద్దాం ఏమంటారు
No comments:
Post a Comment