Thursday, January 27, 2022

త్రయీ కృతులు

""త్రయీ కృతులు"""
.........................................

ప్రకృతి...

మన గతమెంత గొప్పదైన,,,ఎంత చండాలందైనా,,
గతంలో నీకెంత మంచి జరిగి వున్నా,..,,ఎంత చెడు జరిగి వున్నా.. గతంలో మనమెవరమైనా మర్చిపోవాల్సిందే...గతం గతః...

""గతాసూన్ అగతాసూన్ నాను సోచంతి పండితః ""

అని గదా...గీతా సారం...కాబట్టి గతానికి అంటకుండా జీవించడమే .ఇతరుల గురించి తప్పుగా మాట్లాడకుండా ఎవరిని హేళన చేయకుండా ఉండమే...............................ప్రకృతి బద్దంగా,,,ప్రకృతి ధర్మమంగా జీవించి నట్లు....ఇది మొదటి ""కృతం""...

సంస్కృతి.....

ఈ క్షణంలో వుంటూ ,,,మన జీవితంలోకి ఏది వచ్చినా దాన్నుండి నేర్చుకుంటూ వుండాలి..దాన్ని వద్దనరాదు..
భయపడకూడదు...రానీ చూద్దాం అన్నట్టు వుండాలి..ఎవ్వరికీ దేనికీ భయపడకూడదు...ఈ క్షణం జీవిత పాఠాలను శ్రద్ధగా నేర్చుకుంటూ వుండాలి... ఏ క్షణానికి ఆ క్షణం జీవితం మనకు బోలెడన్ని పాఠాలను నేర్పుతుంది...ఇలా ఈ వర్తమాన క్షణంలో జీవిస్తూ నేర్చుకోవడాన్నే ....సంస్కృతి అంటారు...ఇది
రెండవ """కృతి ""

ప్రగతి....

పై రెండు పనులూ చక్కగా చేసుకుంటూ నిన్ను నీవు సంస్కరించు కోవడాన్నే ""ప్రగతి"" అంటారు...
ఎప్పుడూ గతాన్ని తల్చుకుంటూ వుంటే ప్రగతి అనేది వుండదు...ఎప్పుడూ ఈ క్షణంలో జీవించకుంటే ప్రగతి లేదు..
ఈ క్షణంలోని జీవిత అనుభవాల నుండి ఏమీ నేర్వక పోతే
ప్రగతి వుంటుందా ....? ఎదుగుదల వుంటుందా చింతిస్తూ వుంటే...?,, కాబట్టి....మనల్ని మనం ఉద్దరించు కోవడమే,,, సంస్కరించు కోవడమే....ప్రగతి
...ఇది మూడవ కృతి..

ఈ ""త్రయీ కృతులు"" అనేవి నిరంతర ప్రక్రియ...


🙏🙏🙏

సేకరణ

No comments:

Post a Comment