Thursday, January 27, 2022

అన్ని సంపదల కన్నా ఆత్మ సంపద మిన్న

అన్ని సంపదల కన్నా ఆత్మ సంపద మిన్న. డబ్బు బంగారం ఇళ్ళు పొలాలు వీటి అన్నిటి కన్నా జ్ఞాన సంపద అంటే ఆత్మ సంపద గొప్పది మహాగొప్పది. ఎందుకంటే మనం వున్నా లేకున్నా మనతో పాటు వచ్చేది ఆత్మ సంపద. అంటే జ్ఞాన సంపద. అది ఎంతకీ తరగనిది. ఎంత కావాలంటే అంత పెంచుకొగలిగేది ఆత్మ సంపద.

దీనికి ఎలాంటి పన్నులు( TAX ) వుండవు.దొంగల భయం కానీ నిప్పుభయం కానీ నీరు భయంకానీ వుండదు లేదు కూడా. అటువంటి ఆత్మ సంపదకు ఖర్చు లేదు శ్రమ అసలేలేదు. నియమాలు అవసరం వుండవు.

అంతటి గొప్పదైన ఆత్మ సంపదకు చేయాల్సిందల్లా ఒకే ఒక్క పని. అదే శ్వాస మీద ధ్యాస.

గొప్ప గొప్పవారి పుస్తకాలు చదివి అందులోని సారాంశం గ్రహించి గమనించి ఆచరిస్తే చాలు .ఇది ఎవరైనా చేయవచ్చు. ఎక్కడైనా చేయవచ్చు. ఎప్పుడైనా చేయవచ్చు.లాభాలే లాభాలు. పాపాలు పోతాయి. సమస్యలు రావు. రోగాలు వుండవు.

కావున ఆత్మ జ్ఞాన సంపద కన్నా పవిత్రమైనది ఏది ఈ సృష్టిలో లేదు. మరి ఈరోజే మొదలెడదామా! ఇప్పుడే ఇక్కడే ఈ రోజే! 🙊🙈🙉

సేకరణ

No comments:

Post a Comment