Friday, July 8, 2022

మంచి మాట..లు(06-07-2022)

బుధవారం --: 06-07-2022 :--

ఈ రోజు AVB మంచి మాట..లు
జీవితం అంటే ఒకరిని ఏడిపించేలా కాదు... నీ కోసం ఒకరు ఏడ్చేలా బత్రకాలి
నమ్మకం అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా నటించే పాత్ర కాదు ఎప్పుడూ ఒకేలా ఉండే గుణం ఉండాలి
నిరంతరం ఆనందంగా ఉండాలంటే మనసును ఇబ్బది పెట్టే విషయాల నుండి విముక్తి పొందు, ఏ విషయంలోనూ తప్పులు వెతకకు,, ఎప్పుడైతే తప్పులు వెతకడం ప్రారంభిస్తావో అప్పుడే ఆనందాన్ని కోల్పోతావు,,

ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు.. మోసం దుర్మార్గం చేయడం వ్యక్తిని బట్టి వుంటాయి గానీ కులాన్ని బట్టి జాతిని బట్టి కాదు గౌరవం అనేది వయస్సును బట్టి ఉండదు వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఉంటుంది .

మన జీవితంలో ఎదురయ్యే వారంతా మనకు గురువులే మంచి వారు పాఠం నేర్పుతారు చెడ్డవారు వారు గుణపాఠం నేర్పుతారు..
కష్టం విలువ తెలిసిన వారు ఎవరినీ కష్టపెట్టరు ఇష్టం విలువ తెలిసిన వారు ఎవర్ని వదులుకోరు .

సేకరణ ✍️AVB సుబ్బారావు 🌺💐🌹🤝🙏...

సేకరణ

No comments:

Post a Comment