Thursday, July 14, 2022

మంచి మాట.. లు(12-07-2022)

 మంగళవారం --: 12-07-2023 :--

ఈ రోజు AVB మంచి మాట.. లు
మనకు బలం ఉంది కదా అని శత్రువులను పెంచుకోకు మనలో బలం తగ్గిన రోజు నిన్ను వేటాడేస్తారు... ఎదుటి వారిని విమర్శించే ముందు నువ్వు కరెక్టగా ఉన్నవో లేదో చూసుకో ఎందుకంటే నువ్వు ఒకరిని విమర్శిస్తే నిన్ను విమర్శించేవారు ఇంకొకరుంటారు .

మనం ఆత్మీయత పంచుకోవాలంటే రక్త సంబంధమే అయ్యుండనవసరం లేదు !.. బాధలు కష్టాలు పంచుకోవాలంటే తోడపుట్టినవాళ్ళే కానక్కరలేదు.. నీడలా తోడుంటూ నవ్వుతూ నవ్విస్తూ అనుక్షణం మనతో ఉండే ఒక స్నేహితుడు ఉంటే చాలు .

మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు...అలా ఉంటారు అనుకోవడం భ్రమ , మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు .

కొంచెం 
మనసు పెట్టి ఆలోచిస్తే ఏలాంటి సమస్యకు అయినా పరిష్కారం దొరుకుతుంది . మనసు పెట్టి పనిచేస్తే పనిలో విజయం చేకూరుతుంది , మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంటబడుతుంది , మనసుతో చేసే పనులు ఇంత మంచివైనపుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువెందుకిస్తారు ఓ మనిషీ కాస్త ఆలోచించు ! ...

సేకరణ ✒️
మీ ..AVB సుబ్బారావు 💐🤝🙏
📞9985255805🇮🇳

No comments:

Post a Comment