Thursday, July 7, 2022

బైబిల్ లో భూమి బల్లపరుపే

 బైబిల్ లో భూమి బల్లపరుపే

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

🔴 బైబిల్ లో సైన్స్ కాదు కదా కామన్ సెన్స్ కూడా ఉండదు.. ఉన్నదంతా నాన్ సెన్సే!! బైబిల్ మొదటి పేజీలో నాలుగు వాక్యాలు చదవగానే ఇది సీరియస్ గా చదవాల్సిన బుక్కు కాదు అని అనిపించలేదంటే ఆ వ్యక్తి కామన్ సెన్స్ లేదని అర్థం. 


🔴 వివరాలలోకి వస్తే బైబిల్ లో భూమి బల్ల పరుపుగా ఉంది అని ఎక్కడ రాసారు అని కొందరు అడుగుతుంటారు.. భూమి బల్లపరు అనే వాక్యాన్ని డైరెక్టుగా చూపించు అంటుంటారు.. వాస్తవానికి మన భూమి మన కంటికి బల్లపరుపుగానే కనిపిస్తుంది. బల్లపరుపుగా ఉండే భూమిని ప్రత్యేకంగా బల్లపరుపు భూమి అని, భూమి బల్లపరుపుగా ఉందని చెప్పాల్సిన అవసరం లేదు..కానీ ఆ భావనతోనే నేటికి మనం వ్యవహారంలో మాట్లాడుతుంటాం. సరిగ్గా బైబిల్ రచయితలు కూడా ఆ భావనతోనే వాక్యం రాసారు. 


🔴 గ్రీకు దేశం ఆరు వేల చిన్నా చితక ద్వీపముల సముదాయం. అందువల్ల అక్కడ నౌకాయానం ⚓ నిత్యజీవితంలో ఓ భాగం అయ్యింది. అందులో నేర్పరులు అయ్యారు. సుదీర్ఘ వారి నౌకాజీవనయానంలో వారో విచిత్రాన్ని గమనించారు. అదేమిటంటే తీరం నుండి ఒక వచ్చే నౌకను గమనిస్తే.. అది తొలుత తెరచాప ⛵ పైకొనభాగం వచ్చే కొద్దీ పూర్తి తెరచాప ఆ తరువాత నౌకా కనిపించేది. అప్ ఎక్కుతున్న స్కూటరీస్ట్ అప్ లో ఉన్నవారికి తొలుత హెల్మెట్ తరువాత ఫేస్ తరువాత క్రమంగా పూర్తి స్కూటరీస్ట్ 🛵 కనిపించినట్లు ఆ నౌకలు కనిపించేవి.. అంటే అక్కడ డౌన్ ఉందని వారు అర్థం చేసుకున్నారు. అయితే అక్కడికి వెళ్లి చూస్తే తీరం నుండి వచ్చే నౌకలు ఇదేవిధంగా కనిపించేవి. మనం ఉన్న పాయింట్ నుండి ఎక్కడికి వెళ్లినా అన్ని దిశలలో డౌన్ గా ఉండటం ఒక గోళాకారంలోనే సాధ్యం అని గ్రహించి వారు భూమి గుండ్రంగా ఉంది అని క్రీపూ. 4వ శతాబ్దమునాటికే తెలుసుకున్నారు. గ్రీకులు క్రీస్తు పూర్వం 4-3వ శతాబ్దంలో ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకుని పాలించారు. అంతకు ముందు ఇశ్రాయేలీయులకు భూమి గుండ్రంగా ఉంది అనే విషయమే తెలియదు.. ఆతరువాత కూడా చాలామంది బైబిల్ రచయితలకు భూమి గుండ్రంగా ఉందని తెలియదు. 


🔴 భూమి బల్లపరుపుగా ఉందన్న భావనతో రాసిన కొన్ని వచనాలను చూద్దాం..


🖋️కీర్తనలు 33: 13

యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు ఆయన #నరులందరిని #దృష్టించుచున్నాడు.

🖋️కీర్తనలు 33: 14

తానున్న నివాసస్థలములోనుండి #భూలోక #నివాసులందరివైపు #ఆయన #చూచుచున్నాడు.


👉మన యెహోవా వారు ఆకాశంలో తన నివాసస్థానం (గుడారం?) నుండి భూ నివాసులందరిని చూస్తున్నాడంట.. ఇలా భూ నివాసులను అందరిని ఒక చోటు నుండి చూడాలి అంటే భూమి బల్లపరుపుగా ఉన్నప్పుడే సాధ్యం. 


🖋️యెషయా 5: 26

ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజము నెత్తును #భూమ్యంతమునుండి వారిని రప్పించుటకు ఈల గొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు.


👉ఇక్కడ భూమి అంతములు అంటున్నాడు. బత్తాయి వంటి భూమికి అంత్యము అనేది ఉండదు. బల్ల పరుపుగా ఉన్నప్పుడే సాధ్యం.


🖋️యెషయా 11: 12

జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు #దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును.


👉నాలుగు దిగంతాలు అన్నాడు (the four corners of the earth.) దిక్కులకు అంతము అనేది ఉండదు.. ఆకాశం భూమి కలిసినట్లు కనిపించినా అవి ఎలా కలవవో అదే విధంగా రెండు దిక్కులు కలిసి కార్నర్స్ ని ఏర్పరచవు. ఇదంతా కేవలం భూమి బల్లపరుపుగా ఉంది అనే భావనతో రాసుకున్నారు.


🖋️యెహేజ్కేలు 7: 2

నరపుత్రుడా, ప్రకటింపుము; ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చియున్నది, #నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభు వగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది.


🖋️Ezekiel 7: 2

the four corners of the land.


👉భూమికి కార్నర్స్ ఉండవు.. ఎందుకంటే భూమి బంతి ఆకారంలో ఉంది. 


🖋️దానియేలు 4: 10

నేను నా పడకమీద పరుండియుండగా నాకు ఈ దర్శనములు కలిగెను; నేను చూడగా #భూమిమధ్యను మిగుల ఎత్తుగల యొక చెట్టు కనబడెను.


🖋️Daniel 4: 10 the midst of the earth,


👉భూమి బంతిలా ఉంది కాబట్టి దానికి మధ్య అనేది ఉండదు. లేదా ప్రతి ప్రదేశం దానికి మధ్య ప్రదేశమే అవుతుంది.


🖋️దానియేలు 4: 11

ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను; దాని పైకొమ్మలు ఆకా శమునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము #భూతలమంత విశాలముగాను ఉండెను.


🖋️Daniel 4: 11 the end of all the earth:


👉గోళిలా ఉన్న భూగోళానికి అంతం/తలం అనేదే లేదు.


🖋️మత్తయి 4: 8

మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ #లోక #రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి


👉ఇది కూడా భూమి బల్లపరుపుగా ఉందన్న భావంలో రాసాడు.. భూమి గుండ్రంగా ఉంది కాబట్టి చంద్రమండలం మీదకు ఎక్కిపోయిన సగం భూగోళం మాత్రమే కనిపిస్తుంది తప్ప మొత్తం ప్రపంచం కనిపించదు.


🖋️ప్రకటన గ్రంథం 1: 7

ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; #భూజనులందరు #ఆయనను #చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.


👉యేసు పరలోకం నుండి మేఘాల మీద రెండో రాకడగా వస్తాడు.. అలా అందరికి కనపడాలి అంటే భూమి గుండ్రంగా ఉన్నప్పుడే సాధ్యం. ఒక వేళ యేసు భూమిని ఓ రౌండ్ వేసి వస్తే సాధ్యం అవ్వచ్చుగాని.. ఆయనకు మేకులు కొట్టినోళ్లు చూసే చాన్స్ లేనే లేదు.. యేసు, ఆయనకు మేకులు కొట్టిన వారు బ్రతికి ఉండగానే రెండో రాకడ వస్తాడన్న ఉద్దేశ్యంతో రాసాడు.


🖋️ప్రకటన గ్రంథం 7: 1

అటుతరువాత భూమియొక్క #నాలుగుదిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచ కుండునట్లు భూమియొక్కనాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని.


👉నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుడడం సాధ్యం కాదు.. ఎందుకంటే భూమి బల్ల పరుపు కాదు గోళాకారంలో ఉంది. 


🤦ఇందులో కొన్ని వ్యావహారికంగా అన్నాడు అనుకున్న కూడా చాలవరకు భూమి బల్లపరుపుగా ఉన్నట్లు భావించి రాసుకున్నవే అని స్పష్టంగా తెలుస్తోంది. 


🤷 అయినా వ్యావహారికంగా అయినా ఎందుకు అనాలి?⁉️ అలా అంటే అబద్దం చెప్పినట్లు అవుతుంది కదా?💯 దేవుడు అబద్దం చెబుతాడా? ఇన్ని అబద్దాలు చెప్పే బదులు "ఆదియందు దేవుడు భూమిని సృజించెను అది గోళాకారంగా ఉంది" అని చెప్పివుంటే అప్పుడు అది సైన్స్ అయ్యివుండేది.. ఇలా న్యూసెన్స్ క్రియేట్ అయ్యేది కాదు. న్యూసెన్స్ క్రియేట్ చేయాలన్నది ఉద్దేశ్యం కాదు.. భూమి బల్లపరుపుగా ఉందన్న భావనే వారిచే ఇలా రాయించింది.

----సేకరణ


No comments:

Post a Comment