Wednesday, July 6, 2022

కష్టమైన సరే

🍀🍀🌻🌻🌷🌷
కష్టంమైన సరే "

పట్టుదలతో దృష్టి పెట్టు
మీ ఇష్టమైన అంశం మీద...
పట్టుదల విడువకు కష్టమొచ్చిందని...
ఇష్టంగా మలుచుకో విశిష్టతతో....
ఎవరు తిట్టినా నెట్టినా
ఎవరు ఎమన్నా వదిలేయకు...

కొన్ని వేల జనం మీచుట్టూ..
అది మరువ కూడదు...,
భయపడకు!! మనసు పెట్టండి!!
మంచి ఆలోచన తడుతుంది...
మీరు అనుకున్నది మదిలో మెదులు...

పట్టుకున్న ఇష్టాన్ని విడువకు...
వచ్చిన అదృష్టాన్ని వదలకు...
మీలో ఒక సుదీర్ఘ చూపు ఉంది...
మీకు తెలియకుండానే మేలు చేస్తుంది..

కష్టాన్ని ఎదిరించైనా ఇష్టాన్ని నిలుపుకో..
వచ్చే సమస్యల్ని లెక్కచేయకు...
మీ మాటకు అడ్డుండదు...
మీ నడకకు సాటి ఉండదు...
మీ ప్రతిభకు లోటుండదు...
మీ భవితకు తిరుగుండదు...

కొందరు జీర్ణించుకోలేరు...
కొందరు ఓర్చుకోలేరు....
అయినా మీ నడక మీదే...
మీ నడత మీదే...

తొందరపాటులో
పొరపాట్లు చేయొద్దు...
కొందరు నిలదీసి నిప్పులు కక్కుతారు..
పైన బురుద చల్లుతారు...
నిబద్ధతను..మరవొద్దు...

ఇలాంటి వారిని
చూపుల నుంచి బహిష్కరించు...
కొత్త పోకడలకు కొత్త దారులు
వేయాలంటే పట్టుండాలి...
మనసును తట్టి లేపే ప్రేరణ ఉండాలి...

ఎదురుచూసే కాలం పోయింది...
ఎదురు తిరిగే కాలమిది...
హింసాత్మక ధోరణి వద్దు...
హంసలా ఉండడమే ముద్దు...
పీడించే హింసను వదిలించు...

ఇదే నేటి తరానికి నిజమైన మంత్రం!!
అందరు మెచ్చిన సూత్రం!!...
కళ్లెదుటే జరిగే నిజాన్ని చూసి
తట్టుకోలేక పట్టుకొని కొట్టలేక
మనసును చంపుకొవడం!!...

ఇంకా ఎన్ని రోజులు??..
ప్రాణాల్ని మానాల్ని దాచుకొని బతకడం!!...
మనిషిని బంధించినా
మనసు ఆగదు..ఆవేశం నిలవదు
కానీ ఆలోచించి ఆడుగు వేయాలి
నేటి వ్యవస్థను మార్చే విధంగా..!!
🙏🙏🙏🙏🙏

సేకరణ

No comments:

Post a Comment