🪷🪷 "38" 🪷🪷
🪷🪷 "కర్మ - జన్మ" 🪷🪷🪷🌼🪷🌼🪷🌼🪷🌼
🌼🪷🕉🪷🌼
🌼🪷🌼
🌼
"కలిసి చేసే కర్మ ఫలం":
"సాధారణంగా ఏ మానవుడూ కర్మని ఒంటరిగా చేయడు. ఇతరులతో కలిసే చేస్తాడు. ఉదాహరణకి మనం ఇంట్లో చేసే భోజనం మనకి అందడానికి దాన్ని పండించిన వాళ్ళు, ఇంటి ముందుకి వచ్చే కూరల బండి వాడు, మధ్య గల దళారులు, అవి పండిన పొలానికి అప్పు ఇచ్చిన బేంకు వాళ్ళు, దానికి హామీ ఉన్నవాళ్ళు, మన ఇంట్లో దాన్ని శుభ్రం చేసి వండినవాళ్ళు, వండటానికి తెచ్చిన వాళ్ళు, ఆ గేస్ ని వెలికి తీసి ఇంటికి సరఫరా అవడానికి భాగం పంచుకున్న అనేకులు కూడా మనం తినడం అనే కర్మలో భాగం పంచుకున్నారు."
"వారిలో ఏ లింకు తెగిపోయినా మనం అన్నం తినలేం. వారంతా మనం భోజనం తినడం అనే సుకర్మలో భాగం పంచుకుంటారు. ఇలాంటి ఉదాహరణలు మన నిత్య జీవితంలో చాలా ఉంటాయి. అలాగే మనం కూడా ఇతరులు చేసే కర్మల్లో భాగం పంచుకుంటాం."
"కర్తా కారయితా చైవ ప్రేరకశ్చాను మోదకః!
పుణ్యకార్యే పాపకార్యే చత్వారస్సమభాగినః!!"
భావం:-
"కర్మని చేసేవాడు, చేయించేవాడు, దానికి ప్రేరణని ఇచ్చేవాడు. దాన్ని చూసి ఆనందించేవాడు - ఈ నలుగురు కలిసి చేసిన పాపకార్యంలో కాని, పుణ్యకార్యంలో కాని, దాని ఫలం పంచుకోవడంలో కాని సమాన భాగస్తులు అవుతారు".
"వెంకయ్య స్వామి కూడా ఓ సందర్భంలో ఇదే చెప్పారు. గొర్రెలు కాచుకుని వాటిని కసాయి వాడికి అమ్ముకునే వ్యాపారం చేసే ఒకతను స్వామి వారికి భక్తుడిగా మారాక ఆ వృత్తిని మానుకున్నాడు. పదిహేనేళ్ళు స్వామి వారి సేవకే అంకితమయ్యాడు. పదిహేను సంవత్సరాల తర్వాత అతను ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తిరిగి ఆ వృత్తినే కొనసాగించమని స్వామి చెప్పారు."
'అది పాపమని నువ్వే అన్నావుగా' అంటే, స్వామి ఇచ్చిన జవాబు."
"అయ్యా! పదిమందిలో నువ్వు పదకొండో వాడివి కదా.” !
"అంటే గోర్రెల యజమాని, వాటిని మేపినవాడు, సంతకు లేదా కసాయి వాడికి తోలినవాడు, కోసినవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తిన్నవాడు... ఇలా ఆ గొర్రెల పుట్టుక నించి, అవి చచ్చే దాకా ఆ పాపంలో ఎంతోమంది భాగస్వాములు అవుతారని స్వామి చెప్పారు. వాడికి తెలిసింది ఆ ఒక్క పనే కాబట్టి స్వామి వాడిని ఆ పనే చేయమన్నారు."
"మనువు కూడా మనుస్మృతిలో ఇలా చెప్పాడు."
"అనుమంతా విషస్థితా నహంతా క్రయవిక్రయా!
సంస్కర్తా చోపహర్తా చా ఖేడకశ్చేతి మాతుకాః!!"
భావం:-
"హింసని అనుమతించేవారు, చంపేవారు, మాంసాన్ని అమ్మేవారు, దాన్ని వండేవారు, వడ్డించేవారు, దాన్ని తినేవారు... ఈ ఆరుగురూ ఆ పాపాన్ని పంచుకుంటారు."
"ఇదే సూత్రాన్ని అనుసరించి, సమర్ధులైన ఇతరులని పుణ్యకార్యాలు చేయడానికి ప్రేరేపించినా, చెడు పనులని చేయకుండా నిరోధించినా కూడా వారి కర్మ ఫలంలో భాగం పంచుకుని మనం సుకర్మలని పెంచుకోవచ్చు."
"దుష్కర్మ సమాజానిది - ఫలం మనది"
"ఓ వర్షపు చుక్క వల్ల వరద రాదు కాబట్టి ప్రతీ వర్షపు చుక్కా వరదకి తన బాధ్యత లేదనుకుంటుంది. కొన్ని కోట్ల వర్షపు చుక్కలు కలిస్తేనే వరద వస్తుంది."
"ఇలాగే ఏ మనిషి సమాజంలోని జాడ్యాలకి తను బాధ్యుడు కాదనుకుంటాడు. కాని అందుకు అతను బాధ్యుడై, తగిన కర్మ ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది."
"ఉదాహరణకి ముప్ఫైరూపాయల దూరానికి ఆటో వాడు అరవై అడిగినప్పుడు ఆ మొత్తం ఇచ్చి ఎక్కినవాడు ఈ సామాజిక దుష్కర్మని ప్రోత్సహించడంతో అందులో చిక్కుబడతాడు. దీనివల్ల ఆటోవాడికి ఎక్కువ అడిగినా ఇస్తారనే ధీమాని అతను ఇస్తున్నట్లే."
"సమాజంలోని ఎవరూ ఎక్కువ ఇవ్వమని భీష్మించుకుంటే ఈ దుష్కర్మకి తావుండదు. దీని వల్ల జరూరు పనిమీద వెళ్ళాల్సిన అమాయకులు కూడా ఒకోసారి మీటర్ కన్నా విధిగా ఎక్కువ చెల్లించి ఆటోని ఎక్కాల్సి ఉంటుంది. అన్యాయాన్ని ఎదుర్కోని సమాజంలో ఉండే ప్రతీవాడు, దాన్ని ప్రోత్సహించేవాడి దుష్కర్మ ఫలితాన్ని ఇలా అనుభవించాల్సిందే."
"ఇలాగే లంచం ఇచ్చే సమాజం లంచాన్ని ప్రోత్సహించే సమాజమే అవుతుంది. అలాంటి సమాజంలో ఉన్న మనమంతా లంచాల బాధితులమే. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా లంచం ఇవ్వకుండా మన పని జరగుతుందా?"
"కొద్ది మంది ముఖ్యమంత్రుల అరాచక పరిపాలన అని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. ఐతే ఆయన ఆ దుష్కర్మలన్నిటిని ఒంటరిగా చేయలేదు. దానికి ఎంతో మంది సహకారం ఉంది. మాట విని అన్యాయంగా ప్రవర్తించిన ప్రభుత్వోద్యోగులు, ఇంకా ఎందరో సహకరిస్తేనే ఆ ఆర్ధిక, ఇతర దుర్మార్గాలు సాగాయి."
"అలాంటి సమాజంలో ఉన్న ప్రజలు దాన్ని ప్రతిఘటించకపోవడం అనే పాప ఫలితాన్ని అనుభవించాల్సిందే. మన రాష్ట్ర ప్రజలంతా ఆ దుర్మార్గుల మధ్య ఉండటమే వీరు చేసే పాపం అయి తమకి తెలీకుండానే ఆ దుష్కర్మల్లో చిక్కుబడతారు. ఇది - "పంచుకునే కర్మ ఫలం" అవుతుంది."
"(తరువాతి భాగంలో - ఈ జన్మ కర్మానుభవం ఈ జన్మలోనేనా!?)"*
🌼🪷🌼🪷🌼
🌼🕉🌼
సేకరణ
No comments:
Post a Comment