Wednesday, July 13, 2022

సాధనలో మంచిది, గొప్పదైన మార్గం ఏదైనా ఉందా ?

💖💖 "278" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖

"సాధనలో మంచిది, గొప్పదైన మార్గం ఏదైనా ఉందా ?"


"సాధనలో ఒక మార్గం గొప్పది, ఒక మార్గం అల్పమైనది అని లేదు. ఫలం శ్రద్ధలో ఉందిగానీ మార్గంలో లేదు. భక్తి, జ్ఞాన, యోగాల మిళితమైన 'నామజపం' ఇవ్వలేని ఫలమంటూ ఏదీలేదు. సత్యాన్ని నిర్గుణంగా దర్శించిన ద్రష్టలు, మనకోసం దైవానికి రూపనామాలు ఏర్పాటుచేస్తే, మనం మాత్రం నేరుగా ధ్యానం చేస్తామంటే సాధ్యపడే పనికాదు. గతజన్మలోనే సాధన పూర్తిచేసుకున్న కృతోపాసకులకు సాధ్యమయ్యే మార్గాలను మనకు అన్వయించుకోకూడదు. హోటల్ కు వెళ్ళి నేనే వండుకొని తింటాననటం ఎలాంటిదో, మన పూర్వికులు చూపిన సర్వజనీన మార్గాన్ని వదిలి సొంత ప్రయత్నం చేయటం అలాంటిది !"

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}


సేకరణ

No comments:

Post a Comment