Friday, July 8, 2022

ప్రశ్న :--- మన అంతరంలోనూ బాహ్యంలోనూ సంతృప్తిగా ఉండటానికి అవసరమైనవి ఏమిటి...

🔺 పత్రీజీ సమాధానాలు 🔺
🌹 చాప్టర్ -- 5 :--- ఆధ్యాత్మిక శాస్త్రం 🌹

🍁 ప్రశ్న :--- మన అంతరంలోనూ బాహ్యంలోనూ సంతృప్తిగా ఉండటానికి అవసరమైనవి ఏమిటి... సవివరంగా తెలియ చెయ్యండి.

🍀 పత్రీజీ :--- అంతర మౌనం, బాహ్య అంగీకారం అన్నవి అత్యంత ఆవశ్యకం. మీ లోపల నుంచి నిశ్శబ్దంగా ఉంటూ... చుట్టూ ఉన్న వాటిని యధాతథంగా అంగీకరించాలి. దేన్నీ తిరస్కరించకుండా ఉండాలి.

🌸 జీవిత అనుభవాలు, పరిస్థితులు అన్నింటినీ ప్రశాంతంగా ఎదుర్కోవాలి. అంతరంలో శాంతి నిండుగా ఉండాలి. ఉదాహరణకు ట్రాఫిక్ ను తీసుకుందాం.

🌿 ఎక్కడికైనా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవటంవల్ల ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడితే మీరు ఏం చేస్తారు? ఆ పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలి. మీరు మీ ఆఫీస్ కు ఆలస్యంగా వెళ్తారు 'కానీ మీ అంతరంలో అలజడి, ఆదుర్దా కలుగకూడదు . మరో గంట తర్వాత మీ ఆఫీసుకు చేరుకోవచ్చు . మీరు ఏం చేసినా ఫలితం ఉండదు . ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు . దానికి మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు . కనుక అంతరంలో ప్రశాంతంగా ఉండి బాహ్య పరిస్థితులను అంగీకరించాలి .

🌳 మరో ఉదాహరణ - మీరు ఎయిర్ పోర్ట్లో ఉన్నారు . మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందని తెలిసింది . అప్పుడు మీరేం చేస్తారు ? ఆ తర్వాతి ఫ్లైట్ కోసం వేచి చూడాలి . ఆ పరిస్థితిని అంగీకరిస్తూ అక్కడ ప్రశాంతంగా ఉండాలి . రాబోయే విమానం కోసం ఎదురుచూడటం తప్పించి మీరు చెయ్యగలిగేది ఏమీ లేదు . అందుకని హాయిగా ప్రశాంతంగా మరో ఫ్లైట్ కోసం ఎదురుచూడండి . ఆవిధంగా అంతర శాంతిని , బాహ్య అంగీకారాన్ని సాధించాలి.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌷 పత్రీజీ సమాధానాలు పుస్తకం మరియు ఇతర పత్రీజీ పుస్తకాల సెట్ కావాల్సిన వాళ్ళు 9032596493 కి what's app msg చేయగలరు.

👍 VicTorY oF LiGhT🎇

💚🔆 Light Workers---- 🔄♻🔁 Connected with Universe💓🌟🌕✨💥☣

సేకరణ

No comments:

Post a Comment