*నేడు కొందరిలో ఉన్న భక్తి.......*
🌻🌺🍀🌻🌺🍀🌻🌺🍀🌻🌺
*🌴🏵🙏జై శ్రీమన్నారాయణ🙏🏵🌴*
*🙏🕉ఓం అస్మత్ గురుభ్యోనమః🕉🙏*
*🙏శ్రీమతే రామానుజయా నమః🙏*
భక్తి పేరుతో మనము దైవమును వెతుక్కుంటూ వెళ్తున్నాము...
అయితే నిజమునకు భక్తి అంటే భగవంతుడే మనలను వెతుక్కుంటూ రావాలి!...
అదీ అసలైన భక్తి , ఇట్టి భక్తి నేడు ఏ కొంతమంది లోనో అరుదుగా కనిపిస్తుందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు!!...
మరి ఎలా???...
భగవంతుడు అంటే కేవలము కోరికలు తీర్చే కొండగట్టున ఉన్న ఒక రాతి విగ్రహం అనే భావనలో ఉంటున్నాం....
నా కోరిక తీరిస్తే మీకు అది ఇస్తాను, ఇది చేస్తాను అని దైవముతో బేరాలకు దిగుతూ భక్తిని వ్యాపారంగా మారుస్తున్నామంటే , దైవమును మనము ఎంత చక్కగా అర్థం చేసుకున్నామో తెలుస్తూనే వుంది.!
మలినమైన మనస్సుతో, స్వప్న దృశ్యములైన పదార్ధాలతో నిత్యసత్యమైన పరమాత్మ ప్రేమను కొనడం సాధ్యమవుతుందా! ఆనాటి గోపికలు పరిపూర్ణమైన మనస్సుతో, శరణాగతి భావముతో తమ హృదయ కమలమునే కృష్ణునికి అర్పించి తద్వారా కృష్ణుని ప్రేమమకరందమును గ్రోలగలిగారు...
మలినమైన మనస్సును గానీ, క్షణభంగురమైన వస్తువులను గానీ వారు ఏనాడూ అర్పితము చేయలేదు...
కానుకలు ఇవ్వడం వలన మన కోరికలు తీరుతాయనుకుంటే దైవమును దైవముగా భావిస్తున్నామో లేక వ్యామోహసహితుడైన వ్యక్తిగా భావిస్తున్నమో అనేది ఎవరికి వారు విచారణ చేసుకోవాలి...
భక్తిఅంటే దైవముపై అచంచలమైన నమ్మకం ఆయనే ఉపాయం, ఆయనే ఉపేయం (అంటే చేరవాల్సిన గమ్యం ఆయనే చేర్చే సాధనం ఆయనే) అని పూర్తి విశ్వాసం కలిగి ఉండడం ప్రతీ ఆత్మాలో పరమాత్మ నిగూఢమై ఉన్నాడని తెలియగలగాలి ప్రతీ పనీ పరమాత్మ అర్పితంగా చేయగలగాలి నువ్వు స్నానం చేసినా, భోజనం చేసినా ఏమి చేసినా నీలో ఉన్న పరమాత్మ సేవగా భావించి పవిత్ర భావంతో చేయగలగాలి ప్రతీది దైవారిపితంగా ఫలాపేక్ష లేకుండా చేయగలగాలి ఆ స్తితిని భక్తి అంటారు
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
*🌹🙏ఓం నమో వేంకటేశాయ🙏🌹*
🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉
*🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🍀*
No comments:
Post a Comment