Tuesday, July 5, 2022

విచారమార్గంలో సత్ఫలితం రావాలంటే జీవనశైలిపై ఆధారపడి ఉంటుందా ?

💖💖 "270" 💖💖

💖💖 "శ్రీరమణీయం" 💖💖

"విచారమార్గంలో సత్ఫలితం రావాలంటే జీవనశైలిపై ఆధారపడి ఉంటుందా ?"


"విచారమార్గం అంటే భగవంతుని, ఆత్మను గురించి విచారణ మాత్రమే కాదు. మనజీవనంలో ప్రతిబింబించే మన మనస్తత్వాన్ని విశ్లేషించు కోవటం, ప్రతిక్షణం వివేకంతో మెలగటం. తెలివితో బుద్ధిగా వ్యవహరించటం ద్వారా జీవితమంతా విచారణమార్గంగానే సాగాలి. ఉదాహరణకు మన వినోదానికి, టీవి సీరియళ్ళకు వృద్ధులు అడ్డం అనుకుంటే రేపటి మన వృద్ధాప్యం ఏమిటి ? వారి మాటలు చాదస్తాలుకావు జీవితసత్యాలు. వృద్ధులులేని ఇంట్లో నేడు సుఖం పొందుతున్నామని భ్రమిస్తున్నాం. అయితే రేపటి సుఖసంతోషాలనిచ్చే పుణ్యాన్ని కోల్పోతున్నామని తెలుసుకోలేక పోతున్నాం. జబ్బు వచ్చిందని తెలిస్తే వీధి చివరవున్న వారినైనా వెళ్ళి పలకరించే సంస్కృతి మనది. మంచానపడ్డ తల్లిని కూడా పలకరించే బాధ్యతలేని జీవితం విదేశాలది. మనందరం మన జీవన విధానాలను ప్రశ్నించుకోవాలి !"

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
🌼💖🌼💖🌼
🌼🕉🌼


సేకరణ

No comments:

Post a Comment