Wednesday, September 21, 2022

శ్రీ రమణీయం గ్రంథం నుంచి శ్రీ రమణమహర్షి జీవిత చరిత్ర, 10- మూడవ భాగం, ఆ ఆత్మను గురించి తెలుసుకునే విధానమే, “ఆత్మ విచారణ మార్గం” అంటారు. అజ్ఞానమంటే, ఆత్మను మనో దేహాలుగా భావించే మిధ్యాజ్ఞానం.

 *🧘‍♂️60- శ్రీ రమణ మార్గము🧘‍♀️*


*శ్రీ రమణీయం గ్రంథం నుంచి శ్రీ రమణమహర్షి జీవిత చరిత్ర*

*10- మూడవ భాగం*

వెంజీ :- మహర్షి నిర్వికల్ప సమాధిలో ప్రవేశిస్తారా ? 

భగవాన్ :- కళ్ళు మూస్తే నిర్వికల్పం, కళ్ళు తెరిస్తే, సవికల్పం. ఎప్పుడూ వుండేది, తనదైన స్థితి, అదే సహజస్థితి. 

వేంజి:- సిద్ధులు కల యోగులున్నారు. వారి గురించి భగవాన్ ఏమంటారు?

భగవాన్ :- సిద్ధులూ, శక్తులూ ప్రకటనల వల్ల వ్యక్తమౌతాయి. అవి మనసుకు సంబంధించినవి.

వెంజి :- కైలాసం, కాశీ వంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం వల్ల ప్రయోజనం వుంటుందా?

భగవాన్ - వుంటుంది.

వెంజి :- ఆ క్షేత్రాల్లో చనిపోతే, ఫలితం వుంటుందా?

భగవాన్ :- వుంటుంది; 
"కాశి- కైలాసం - మృత్యువు" అంటే ఏమిటో ముందు స్పష్టంగా అర్థమైతే. 

వెంజి :- జ్ఞానికి ఏకాంతవాసం అవసరమా ?

భగవాన్ :- ఏకాంతం మనసులోని సంగతి. మనుష్యుల మధ్య మసలినా, మనో పవిత్రతను నిలుపుకున్నవాడు ఆలోచిస్తూ వున్నా ఏకాంతవాసే! అడవిలో వుండి, అది ఏకాంతవాసం ఎట్లా అవుతుంది? కోర్కెలతో వున్నవారికి అది సాధ్యం కాదు. అనాసక్తుడు ఎప్పుడూ ఏకాంతవాసే! 

“అసలు ఏకాంత మంటే ఏమిటి?" అని ఒకరు భగవాన్ని అడిగారు.

భగవాన్ ;- ఏకాంతమంటే, బైట ప్రపంచం నుంచి విడి నివాసం కాదు. ఆత్మలో స్థిరంగా నిలవడం. ఏకాంత వాసమంటూ ఉన్నచోటూ, అన్నీ వదిలేసి, మరో చోట నివాస ముంటే, అక్కడా పరిసరాలు పరి స్థితులూ ఎదురౌతాయి. అక్కడా సరిపడక చోటూ వదిలి, మరో చోటుకు వెడితే, అక్కడా అంతే!

ఆలోచనా రహితమే, అసలైన ఏకాంతం. మనల్ని తరిమేది, మన మనస్సే. ముందు దాన్ని సిద్ధం చెయ్యాలి. అప్పుడు మనం ఎక్కడ వుంటే అక్కడ, ఆనందంగా, హాయిగా వుండవచ్చు. ఎవరో, ఎక్కడికో వెళ్ళారని నువ్వూ అన్నీ వదిలేసి వెళ్ళకు. ఉన్నచోటే నిశ్చల మనస్సుతో, శ్రద్ధగా సాధన చెయ్యి. బైట సత్సంగం వుంటుందంటున్నావు. అది సరే. అసలైన సత్సంగం, నీలోనే వుంది. అదే నిజమైన గుహావాసం.

“ఆత్మ, ఆత్మ అంటారు, అది ఎక్కడ వుంది?" అని ఒకరు భగవాన్ని అడిగారు. ఆ ప్రశ్నించిన వారి చేతిలో ఒక దిన పత్రిక వుంది. భగవాన్ ఆ పత్రిక చూసి, “పత్రికలోని అక్షరాల కింద వున్న అసలు కాగితాన్ని విస్మరించి, కాగితం కనుపించడం లేదే, అన్నట్లు వుంది వారి ప్రశ్న,” అన్నారు.

సూర్యు - చంద్ర - గ్రహాల - నక్షత్రాల నుంచి ప్రసరించే కాంతిని మనం చూస్తాం, అనుభవిస్తాం. కానీ, ఆ కిరణ ప్రసార సహాయంతో సైంటిస్ట్ వాటి వేగాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, విలువనీ- వాటి వాటి మధ్య గల దూరాల్ని తమకు గల శాస్త్ర పరిజ్ఞానంతో లెక్కలు కట్టి చెపుతాడు. “రేడియో యాక్టివ్ వేవ్స్ - ఎలక్ట్రాన్స్ -న్యూట్రాన్స్ " అంటూ సైంటిస్ట్ ఏం చెప్పినా, అవి మన బుద్ధికీ, తెలివికీ ఇంద్రియాలకు, మనసుకూ అందకపోయినా, అసలు కాంతి అంటే ఏమిటో మనకు ఏమాత్రం తెలియకపోయినా, సైంటిస్ట్ చెప్పాడని, నిశ్చయంగా నమ్ముతాం. కాని, ఒక మహాత్ముడో, మహర్షి, జ్ఞానో, యోగో “ఆత్మ” అనేది ఒకటి వుందని చెపితే, నమ్మడానికి జంకుతాం. సైంటిస్ట్ చెప్పినట్లుగానే మనసుకూ, దేహేంద్రియాలకూ దేహేంద్రియాలకూ అతీతమైనది, అతీతమైనది, అఖండమైనది, శాశ్వతమైనది, అక్షయమైనది, మారనిది, నిత్య సత్యమైనది; అపారం, అనంతం అయిన "ఆత్మ" ఒకటి మనలో - విశ్వమంతటిలో - ఒకటిగా - సమంగా వున్నదంటే నమ్మడానికి వెనుకాడతాం ఎందుకంటే, ఆత్మ గురించిన సంగతులన్నీ కేవలం ఒక సమాచారంగా వుంటాయి గనుక. ఆత్మను వర్ణించడానికి, దాని విలువ కట్టడానికి మాటలు ఒక్కటే సాధనం. అందుచేతనే ఎటువంటి మహాత్ములు చెప్పిన మాటలూ, సరైన ఖచ్చితమైన విజ్ఞానాన్ని అందివ్వలేక పోయాయి. 

అసలు వున్నది ఒక్కటే. దాన్ని ఏ పేరుతో అయినా పిలవవచ్చు. రేడియో యాక్టివ్ వేవ్స్, అనవచ్చు లేదా, ఆనంద తరంగాలనీ అనవచ్చు. ఏదన్నా, అదే అన్నీ, అంతా అదే. అది దేహాన్ని నడిపించే శక్తి అయినా, అది నశించే దేహం వంటిది కాదు. బాధపడే ఇంద్రియాలు వంటిదీ కాదు. అది ప్రాణి, జీవుడూ కాదు. అది మనం అనుకునే మనసూ కాదు, బుద్దీ- తెలివి ఏదీ కాదు, కాని, అది కేవలం సాక్షీభూతంగా, సర్వకాల సర్వావస్థల్లో, సమస్త విశ్వంలో ఒకటిగా, సమంగా, శాశ్వతంగా మారకుండా వుంటుంది. అది తప్ప ఇంకోటి లేదు. దాన్నే అనేక పేర్లతో పిలుస్తారు. సత్ చిత్ - ఆనందం - అన్నీ అదే. అంతా అదే. అన్ని పేర్లూ, దాని పేర్లే. అన్ని రూపాలూ, దాని రూపాలే ! 

అటువంటి ఆత్మకు అన్యంగా, భిన్నంగా ఇంకా ఏదో వుందనుకోవడం, ఉత్త భ్రమ అజ్ఞానం - అవిద్య. అలాగే
దానికి అన్యంగా ఏ దేవుడూ లేడు. దేవుడు అనేవాడు ఒకడు విడిగా వుండివుంటే. ఆయన ఆత్మరహితుడై వుంటాడన్నమాట • అది అసంభవం. కనుక ఆత్మే, సత్యం వాస్తవం – దైవం - శాశ్వతం - శక్తివంతం చైతన్యవంతం. అటువంటి ఆత్మ గురించి యోచించడం, మాట్లాడటం, అసత్యం అజ్ఞానం. అందుచేత భగవాన్ ఎప్పుడూ ఏకత్వాన్నే బోధించేవారు. ఆ ఏకత్వంలో ఏమీ వుండదు, ఏదీ మిగలదు. అదే జీవిత లక్ష్యం కావాలన్నారు భగవాన్.

“మనిషిలో ఆత్మ అనేది ఎక్కడ వుంటుంది ?” అంటే, బలంలో, జంతువు,అంగ సౌందర్యంలో, వృక్ష , పువ్వులో సౌష్టవంలో, దాని వేగంలో, మానవుని హృదయంలో ఉన్నది ఒక్కటే ! ఆత్మ. అదే ఈశ్వరుడు. కాని, మరికొందరు ఆత్మ స్థానాన్ని సహస్రారంలో వెతకమన్నారు. ఇంకొందరు భ్రూమధ్యంలో అన్నారు. 

ఎంత మాట్లాడినా ఉన్నది ఆత్మ ఒక్కటే. ఇంకోటి లేదు. తక్కినవన్నీ నామ - రూపాలతో కూడిన ప్రపంచం. అది మనో కల్పితం. అంటే, సాక్షిగా వున్న "నేనే” ఆత్మ. దాన్ని మించి విడిగా, అన్యంగా, భిన్నంగా ఇంకా ఏదో వుందనుకోవడమే, అజ్ఞానం - అవిద్య - భ్రమ. ఆత్మే, వాస్తవం, యదార్థం. అది సత్యవంతమైనది, దివ్యమైనది, శాశ్వతమైనది, శక్తివంతమైనది, చైతన్యవంతమైనది. దాని గురించి మాట్లాడమే, యోచించడమే అసత్యం.

ఆత్మ ఎప్పుడూ అంతటా, ఒకటిగా, శాశ్వతంగా మార్పు చెందకుండా వుంటుంది. ఓ గొయ్యి తవ్వి, ఆ మట్టి అంతా బైట పోస్తే, అక్కడ అగాధం ఏర్పడుతుంది. ఆ అగాధాన్ని చూసి, “ఇక్కడ అగాధం వుందే ! ” అని ఆశ్చర్యపోతాం. కాని, ఆ అగాధం అక్కడ ఎప్పుడూ వుంది. కాని, అది మట్టితో కప్పబడి
వుంది. మనం చేయవలసింది, ఆ మట్టిని తొలగించడం. అలాగే జ్ఞానాన్ని కప్పిన, మూసిన, మాయ పొరను, అడ్డు తెరను తొలగించడం. దానిపైనున్న గట్టి పెంకును బద్దలు కొట్టాలి. అప్పుడు ఆత్మ ప్రకాశిస్తుంది.

మనకు అన్నిటికన్నా అత్యంత సన్నిహితమైనది, ఆత్మ. దాన్ని తెలుసుకోకపోతే, మనకు విడిగా, దూరంగా ఏదైనా వుంటే, ఇంక దాన్నెట్లా తెలుసుకోగలం ?

ఆ అసలు తెరను గమనించకుండా, దానిపై కదలాడే బొమ్మల సంగతుల్ని, సంఘటనల్ని, విషయాల్ని గమనించడమే, మన దృష్టి. తెరే, ఆత్మ. ఎప్పుడూ వుండేది, ఆ తెరే. నీలో మాదిరిగా, అందరిలో, ప్రపంచ రూపాలన్నింటిలో ఆత్మ వుంది. ఆత్మ మహా సాగరమైతే, ఈ రూపాలూ, అహాలూ దాని నుంచి లేచిన బుడగలు. అవి అశాశ్వతమైనవి. ఒడుదుడుకులు, కష్టాలు, ఈ ద్వంద్వాలూ అన్ని అవస్థలూ, అహానికే గాని, ఆత్మకు కావు. అవి దాన్ని అంటవు.

అన్నీ, అంతా, అందరూ ఆత్మ స్వరూపాలే! కాని, ఎవరూ దానికి ఎప్పుడూ ఎరుకలో వుండరు. బాధలు, కష్టాలు, దుఃఖాలు, యాతనలు అన్నీ అనుభవిస్తారు కాని, దేహాత్మబుద్ధి వీడరు. అది అన్నింటిలోకీ చిత్రమైనసంగతి. అందుచేత మనం చేయవలసింది ఆ దేహాత్మబుద్ధిని పొగొట్టుకోవడం. అంటే, “నేను” అనే ప్రత్యేక వ్యక్తిత్వం నాశనం కావడం.

పుట్టేది గిట్టేది దేహం. నిద్రలో ఆ దేహం ఎరుకలో వుండదు. అయినా నువ్వు వుంటావు. వుంటావుగాని, దేహస్పురణ వుండదు. అంటే, నువ్వు నిద్రలో దేహం కాదు. అవునా ? అటువంటప్పుడు నువ్వు మేల్కొన్న తర్వాత దేహివి ఎట్లా అవుతావు ? ముందు ఆ సంగతి యోచించి, తెలుసుకుంటే, సర్వం

ఆ “భారతి"లో సౌరిస్ రాసిన వ్యాసం "అరుణాచల లేఖ” భగవాన్ చదివించుకున్న తర్వాత “భగవాన్ ఎంత దొంగ!" అన్న మౌన -స్వామి మాట అర్థమైంది. ఆ వ్యాసంలో సారిస్ "భగవాన్ ఎంత దొంగ” అని రాశారు.

ఉదయం పదకొండు గంటలకు ఆశ్రమంలో భోజనానికి గంట కొట్టేవారు. భోజనశాలలో బ్రాహ్మణ - అబ్రాహ్మణ పట్టింపు వుంది. ఏ పట్టింపూలేని భగవాన్, ఆ విభాగం మధ్య కూర్చునేవారు. ఇరు పక్షాల వారికి కన్పించేటట్లుగా. భగవాన్ భోజనం చేయడం ఆరంభించేవరకూ ఎవరూ ఏ పదార్థమూ ముట్టుకునేవారు కాదు. అందరికీ వడ్డించేవరకూ భగవాన్ తినేవారు కాదు.

భోజనానంతరం భగవాన్ తాంబూలం వేసుకునేవారు. దాన్ని పూర్తిగా నమిలిన తర్వాత, నోరు శుభ్రంగా కడుక్కునే వారు. పరిచారకుని నిర్లక్ష్యం వల్ల, వరసగా కొన్ని రోజులు భగవాన్ కి తాంబూలం ఇవ్వడం మరచిపోవడంతో ఆయన తాంబూలం వేసుకోవడం మానేశారు. 

మధ్యాహ్నం రెండు గంటల వరకు భగవాన్ విశ్రాంతి తీసుకునేవారు. చివరి సంవత్సరాల్లో భగవాన్ ఆరోగ్యం కోసం ఆశ్రమాధికారులు విశ్రాంతి సమయంలో హాలు తలుపులు మూసేస్తే, ఒకాయన తెలియక లోపలకు వెడితే, పరిచారకుడు కటువుగా మాట్లాడి కసిరాడు. ఆ సంగతి తెలిసి ధగవాన్ మర్నాడు భోజనానంతరం హాలు బైట మెట్ల మీద కూర్చున్నారు. ఎంతకీ లోపలకు వెళ్ళని భగవాన్ని చూసి, "ఏమిటి బైట కూర్చున్నారు?” అని ఒకరు సాహసించి అడిగితే, “రెండు గంటల వరకూ ఎవరూ హాల్లో ప్రవేశించకూడదు కదా?” అన్నారు. ఆ తర్వాత ఆశ్రమం వారు తమ తప్పు తెలుసుకుని, భగవాన్ని ఎంతో బ్రతిమాలారు. అప్పటి నుంచి అందరికీ, అన్ని వేళలా భగవాన్ దర్శనం కలిగే ఏర్పాటు చేశారు ఆశ్రమాధికారులు.

అహంకరణను “ఆత్మ” అని చాటుతుంది. అహంకారం నుంచి జనించే ఇంద్రియాలూ, మనసూ ఆత్మనిరూపణకు చాలవు. అసలు వాటి ఉనికికి ఆధారం ఆత్మే కదా? ఆత్మలేక అవి నిలవలేవు. ఆత్మకు మార్పు లేదు. అది ఎప్పుడూ ఒకే రీతిగా ఒకటిగా, వుంటుంది. మధ్యలో వచ్చింది, అహంకారం.

ఆ అహంకారం లేవగానే, దాని వెనక వ్యక్తిత్వం తలెత్తుతుంది. అంటే, మేల్కొంటుంది. తర్వాత స్పురణ భావన - తలంపు పుడతాయి. ఆ తలంపుల్లో ఒకటి నాకు ఆత్మసిద్ధి కాలేదు . ' నన్ను నేను తెలుసుకోలేకుండా వున్నాను” అని. అదంతా అహం కారం ఆడించే ఆట. దానికి కారణం, నువ్వు దాని వలలో చిక్కు కోవడం.

మెలకువలోని “నేను” కేవలం అహంభావన. నిద్రలోని “నేను” నిజమైన, సహజమైన “నేను”. నిజానికి నిద్రలో వున్నది, మెలకువలో వున్నదీ ఒకటే “నేను”. కాని, నిద్రలో నిర్గుణంగా వుండి, మెలకువలో సగుణమై నానాత్వం తాలుస్తుంది. నిద్రలోని “నేనే” నిజమైనది, శాశ్వతమైనది. అదే ఆత్మ.

ఆ ఆత్మను గురించి తెలుసుకునే విధానమే, “ఆత్మ విచారణ మార్గం” అంటారు. 
ఆ మార్గంలో మర్మం లేదు, నిగూఢత్వం లేదు. అది గు'ప్తవిద్య కాదు. దాని ఉద్దేశ్యం, మనసును దాని మూలం వైపు తిప్పడం. కాని, దాన్ని తెలుసుకోవడానికి ఒకటి అడ్డు వస్తుంది - అజ్ఞానం. అజ్ఞానమంటే, ఆత్మను మనో దేహాలుగా భావించే మిధ్యాజ్ఞానం. ఆ జ్ఞానం తొలగిందా, ఆత్మ మిగులు తుంది. జ్ఞానం గోచరిస్తుంది. కాని, నిజం చెప్పాలంటే, జ్ఞాన అజ్ఞానాలకు అతీతమైనది ఆత్మ. అది సదా సహజ స్థితిలో వుంటుంది. 

No comments:

Post a Comment