అవును! అదీ నిజమే..ఏది?
------------------------------------------------------
గీతలో కృష్ణుడే స్వీయ డిక్లరేషన్ ఇచ్చాడు
కదామరి! ధర్మం నశించినపుడల్లా నేను
అవతరిస్తానని!.. దాని అర్ధం ఏమిటి?
అవును! అదీ నిజమే. అలానే చెప్పాడు.
సంపూర్ణ స్వేచ్ఛ లో వున్నవాడు మాత్రమే
అలా చెప్పగలడు. నీవు, నేనూ..అలా
చెప్పలేము. కొన్ని నియమాలమధ్య
చావుపుట్టుకల చట్రంలో కార్యకారణాలు
సృజించుకుంటూ కర్మల బంధనాల మధ్య
జీవిస్తున్నాం మనం. మనమలాంటి ప్రమా
ణం చేయలేం. మనమలా ప్రకటించలేం.
కృష్ణునికి మాత్రమే
అలాంటి ప్రమాణం చేయగల ధైర్యం వుంది.
అతనా చట్రంలో వుండడు. కార్య కారణ
బంధనాలలోనూ వుండదు. కర్మలు చేస్తూ
నే, అవేమి అంటకుండా వాటికి అతీతంగా
కూడా ఏకకాలంలోనే ఉండగలడతను.
జీవితాన్ని సమృద్ధిగా సర్వ సంపూర్ణంగా
జీవిస్తాడు. జీవించటంలోని ఆనందం
కోసమే జీవిస్తాడు. కారణంలేని ఇలాంటి
ఆత్మానందం నుండి ఏదైనా ఉద్భవించ
గలదు. ఇలాంటి సంపూర్ణ స్వేచ్ఛకలిగిన
చేతన మాత్రమే ఇలా ప్రకటించగలదు.
.
కృష్ణుడు వస్తే ..
అందుకే పరిస్థితులూ కారణం కాదు. తన
కున్న స్వేచ్ఛ కారణంగా వస్తాడతను. ఆ
అభయం, మాట ఇవ్వడం సాధ్యమైనవాడు
కనుకే అతను వెళ్లినా తిరిగిరానూ గలడు.
జైలులో వుండే ఒక ఖైదీ.. బయట ఉన్నవారికి
అలా మాట ఇవ్వలేడు..ఎప్పుడైనా రాగలనని!
100 డిగ్రీల వేడిమివద్ద ఆవిరికాగల నీరు 90
డిగ్రీలవద్ద ఆవిరికాగలనని చెప్పగలిగితే..ఏ
సూత్రాలకీ అది కట్టుబడిలేదని; ఎపుడైనా
ఆవిరికాగల పూర్తి స్వేచ్చతో అది వుందని
అర్ధం!
స్వేచ్ఛ భాషని
అర్ధం చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఏదొక
బంధనాల్లో, హద్దుల్లో నియంత్రణలో వున్న
మనం కృష్ణుని మాటని విని అనుకుంటాం
ఇక్కడ మనకేదో జరిగిపోగానే అతనువస్తా
డని! కాలానుగుణంగా అవుతారమెత్తి వచ్చే
ఎదో నియమావాళిలో అతనున్నాడని!
ఇక్కడ గమనించాల్సింది
అసలది కానేకాదు. కృష్ణుడిలాంటి వ్యక్తి
అసలు అలా ఎలా ప్రటించగలుగుతున్నా
డాని! అతనిమాట సదా శుద్ధఎరుక నుండి
వస్తోందని. వెయ్యినొక్క వ్యాపకాల్లో మునిగి
తేలే మనం ఆయనలా లేమని.
కృష్ణుడు వెయ్యినొక్క
వ్యాపకాల్లో వున్నా, దేనికి అంటని విధానాన్ని
అతను జీవించి చూపుతున్నా, మనం అది
గ్రహించటం లేదని! అతని మాటని పట్టుకు
వెళ్లాడుతూన్నాం తప్ప, అతనిలా మనమెం
దుకు స్వేచ్ఛ, ఆనందాలను ఒకేసారి కలిగి
లేము అని.. థింక్ చేయటమే లేదు మనం...
.
మన ధ్యాసంతా
ఆయన్ని ఎంత బాగా స్తుతించాం; ఎంత
బాగా అలంకరించాం; ఎంతగా భజనలు
చేసాం అనితప్ప; అనుకరిస్తున్నాం తప్ప
అనుసరించటం లేదు ఎందుకని!?
అతనంటే దేవుడూ..మనకేలా సాధ్యమది
అనుకుంటాం. అవును అలా అనుకుంటేనే
మన లౌకికానందంలో మనం హాయిగా కొన
సాగిపోగలం కదా! కృష్ణుడు ఓవైపు చెపు
తూనే ఉంటాడు కూడా.. ఎంత కావాలో
అంతే అటించుకో..ఏది అంటకుండా కర్మలు
చెయ్యి..డిటాచబుల్ మనసుతో వుండు..
అని. కానీ అవేమి పట్టనట్టు. వినపడనట్టు
అసలేమి తెలీనట్టు.. మన ధోరణిలో మనకి
నచ్చినట్టు జీవిస్తే, కొన్నాళ్ళకది కంపు కొట్టేం
తగా చెడిపోతే..అపుడు వస్తాడు కృష్ణుడు
సంభవామి యుగే యుగే అనుకుంటూ..
రాక తప్పదుమరి అతనికి. తప్పేలా మనం
ఏమి చేయం. చూస్తూ కూర్చుటాం.. పూజలు
మాత్రం చేస్తూ. మన అంతర్గత పరివర్తన
గురించి పట్టించుకోకుండా.
గుర్తుంచుకోవాలిది మనం..
కృష్ణుని లాంటి వ్యక్తి వచ్చేది నీ కారణంగా
నీ సమాజం పరిస్థితి కారణంగా కాదు.
మనలా బంధనాల్లో లేడతను. కాబట్టి
వస్తాడు. ఆయనే స్వేచ్ఛ కనుక స్వతం
త్రుడు కనుక అలా వస్తాడు అలా వెళ
తాడు. స్వీయ ప్రజ్ఞగా పరివర్తన చెంది
వున్నాడు కనుక మనకి...తానో
ఉదాహరణగా వచ్చిపోగలడు అతను.
అతనినుండి మనం నేర్చుకున్నా లేకపో
యినా...అతనికది అనవసరం. ఇది మనకి
అర్ధం కాకపోతే.. అలా అతను ఎన్నిసార్లు
వచ్చినా..నిజంగా అతన్ని అనుసరించి
నట్టేకాదు.
జీవితం ఒక నటన అని కృష్ణుడన్నాడు
నిజమే! కానీ మనం అతని ముందు
భక్తి నటిస్తున్నామని ఆయనికి తెలిస్తే..!?
"సంభవామి యుగేయుగే.." అనుకుంటూ
చకోర పక్షుల్లా ఎందుకు చూస్తారలా..
మీమీ స్వీయ పరివర్తన మరిచి..అని
ఆయన అడిగితే..మన జవాబు ఏమిటి
మరి..!?..
.
(మీ....ఆదిత్యనారాయణ.....తిప్పానా)
No comments:
Post a Comment