సత్యము
ధర్మము
న్యాయము
నీతి
నిజాయితీ
శీలము
ధర్మ సంపాదన
స్వాధ్యాయము
అంతర బాహ్య సూచి
దానము
యోగము
తపస్సు
భక్తి
జ్ఞానము
వైరాగ్యము
త్యాగము
తత్వము ఇవన్నీ ఆత్మకు సంబంధించిన ఆనందాన్ని కలిగిస్తూ ఆనందభాష్పాలు రాలుస్తాయి మనిషికి
.
.
1 తేనెలో నీటిబొట్టు పడకూడదు
2 పాలలో నిమ్మ చుక్క పడకూడదు
3 సన్యాసి శిల్ప సౌందర్యం చూడకూడదు
4 మంత్రసిద్ధి జ్ఞాన సిద్ధి పొందిన వారికి
( కామవాంచ ) కలగకూడదు
కామమే జ్ఞానానికి శత్రువు
కామం జ్ఞానాన్ని హరించివేస్తుంది
ఇంద్రియాలు దృశ్య ప్రపంచం మీదికి వెళ్తాయి
మనసు దృశ్య ప్రపంచం మీద ఆనురాగం ఏర్పరచుకుంటుంది
ఆ అనురాగం వల్ల కోరికలు ఏర్పడతాయి
ఆ కోరికలు తీవ్రమైతే బుద్ధి చెడిపోతుంది
బుద్ధి చెడిపోతే పురుషుడు నశించి పోతాడు
.
( అందుకే కామం జ్ఞానానికి శత్రువు )
.
1 డబ్బు
2 కామం
ఈ రెండు జయించాలి జీవితం చివరి దశ లోపు
.
.
నాలుగు సూత్రాలు
బ్రహ్మ సాక్షాత్కారం పొందిన ఒక సాధువు తన రాజ్యంలోకి వచ్చాడని ఆ దేశపు రాజు తెలుసుకున్నాడు. వెంటనే రాజు ఆయన దగ్గరకి వెళ్ళి అనేక కానుకలు సమర్పించాడు. నమస్కరించి తనకి ముక్తి మార్గం ప్రసాదించి మోక్షాన్నివ్వవలసిందిగా వేడుకున్నాడు.
చిన్నగా నవ్వి ఆ సద్గురువు ఇలా చెప్పాడు:
“రేపటి నుంచి నేను చెప్పే నాలుగు సూత్రాలని విధిగా పాటించు. అవి ముక్తి మార్గాలు.
1. కేవలం అమృత సమానమైన భోజనమే తిను.
2. పుష్పాలతో చేసిన పక్క మీదే పడుకో.
3. ఇనుప కోటలోనే జీవించు.
4. అత్యంత సౌందర్యవతి ఐన స్త్రీ తోనే సంభోగించు.
“స్వామీ! నేనిప్పుడు అనుభవిస్తున్న భోగాలు అవే కదా?
దేశంలోని గొప్ప వంటవాడు నా భోజనం తయారు చేస్తాడు.
సువాసనలు వెదజల్లే రకరకాల మెత్తటి పూలు పరచిన శయ్య మీదనే నేను నిద్రిస్తాను.
నా కోట శతృ దుర్భేద్యమైన ఇనుప కోటగా ప్రసిద్ధి గాంచింది.
నా పట్టపు రాణిగా అత్యంత సౌందర్యవతినే ఎన్నుకున్నాను.
మరి నాకు ముక్తి లభించలేదే?”
అందుకాయన నవ్వి ఇలా చెప్పాడు.
“నా బోధ నీకర్థం కాలేదు. నే చెప్పింది నువ్వు అనుభవిస్తున్న భౌతిక భోగాల గురించి కాదు.
1. నీకు కరకర ఆకలి వేసేదాకా ఆగి అప్పుడు తిన్నదేదైనా అమృతంలా వుంటుంది.
2. బాగా శ్రమపడితే నువ్వు దేనిమీద పడుకున్నా సరే, అది పుష్పాలు పరచిన పడకే అనిపిస్తుంది.
3. భోగాసక్తి లేని యోగి పుంగవులని ఆశ్రయిస్తే నీకు వైరాగ్యం అలవడుతుంది. అదే నీ జీవితానికి ఇనుప కోట అవుతుంది.
4. వారి సహాయంతో నువ్వు ధ్యానం చేయగా చేయగా అత్యంత సౌందర్యవతి అయిన ముక్తి కాంత నీకు లభ్యమౌతుంది. ఆమె ఇచ్చే ఆనందానుభవం ప్రపంచంలోని ఇక దేనితోనూ సరిపోదు.”
ఆ రాజుకి అప్పుడు జ్ఞానోదయమైంది. వెంటనే తన కొడుక్కి పట్టాభిషేకం చేసి వానప్రస్థం స్వీకరించి, తపస్సులో మునిగి పోయాడు. త్వరలోనే ఆయన్ని ముక్తి కాంత వరించింది.
సర్వేజన సుకినో భవంతు.
No comments:
Post a Comment