Sunday, September 18, 2022

మృత్యువు యొక్క తలంపు లేనివాడే మహర్షి

🕉️ శ్రీ గురుభ్యోనమః

మృత్యువు యొక్క తలంపు
లేనివాడే మహర్షి

వెంప, ఫిబ్రవరి 28, 1985


భారతీయుల ప్రాచీన గ్రంథములైన వేదములలో చెప్పబడిన సారమును జీవించి చూపిన ఆధునిక మహర్షి అరుణాచల రమణులు . ఆయన జీవిత విధానము ద్వారా శాస్త్రములలో చెప్పబడిన సత్యము వెలుగులోనికి వచ్చినది. శాస్త్రము యొక్క గౌరవము పునరుద్ధరింపబడినది.

మృత్యువు యొక్క తలంపు లేనివారు మహర్షులౌతారు. మహర్షులు పూజనీయులు, జ్ఞానస్వరూపులు, ప్రేమమయులు. అందువలన మహర్షుల మాటలు చిరకాలం, కలకాలం స్మరణీయములు.

భగవాన్ శ్రీ రమణ మహర్షికి ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో స్థిరమైన స్థానము ఏర్పడినది. ఆయన చేసిన ఉపదేశం ఉపదేశసారము లో ఉన్నది. ఆయన చెప్పిన మాటలు లక్ష్య ప్రధానములు.

ఆత్మ ఒక్కటే దైవము. దానిని తెలుసుకొనుటే జీవితగమ్యము. ఆత్మజ్ఞానము ద్వారా ఆత్మ తెలుస్తుంది. ఆత్మ దర్శనమైనవాడు దుఃఖము నుండి, అజ్ఞానము నుండి విడుదల అవుతాడు. అజ్ఞానమును భరించటం మిక్కిలి కష్టం. మానవుని మానసములో ఉన్న అన్ని దౌర్భల్యములకు, బలహీనతలకు, లోపములకు, రుగ్మతలకు, పాపములకు అజ్ఞానమే కారణము.


🙏సద్గురు శ్రీ నాన్నగారు🙏
"శ్రీ నాన్న ప్రవచనాలు"
సేకరణ : సాగిరాజు రామచంద్రరాజు

🌷🙏🌷

No comments:

Post a Comment