Sunday, September 18, 2022

వల్లాల మహారాజు (శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం నుండి సేకరణ....)

 వల్లాల మహారాజు

అరుణాచల దేవాలయానికి ప్రధాన గోపురం నిర్మించింది "వల్లాల మహారాజు". గొప్ప శివభక్తుడు.

ఇప్పటికీ దాన్ని వల్లాల గోపురం అంటారు. 

ఆయనకు ఇద్దరు భార్యలు.సంతానం లేదు. 
గొప్ప శివార్చన చేస్తుండేవాడు సంతానం కోసం.

పరమేశ్వరుడికి అనుగ్రహం కలిగి చిన్న పరీక్ష పెట్టాడు. తన ప్రధమగణాలను రాజ్యానికి పంపించాడు. 

వాళ్ళందరూ కళావంతుల ఇళ్ళకు వెళ్ళారు. 
వాళ్లు నాట్యాలు చేస్తున్నారు. 
తర్వాత శివుడు రాజువద్దకు వచ్చాడు. 
శివుడిని చూసి శివభక్తుడిలా ఉన్నాడని రాజు ఆహ్వనించాడు. 
అప్పుడు శివుడు కళావంతుల నాట్యం చూస్తానన్నాడు. రాజు కబురుచేస్తే ఒక్కరు కూడా ఖాళీ లేరు, రాలేదు.

రాజు శివభక్తుడికిచ్చిన మాట తప్పుతానని, 
చిన్న భార్యను పిలిచి నీవు శివభక్తుడి వద్దకు వెళ్ళి నాట్యం చెయ్యమని అన్నాడు. 

ఆమె వెళ్ళి నాట్యం చెయ్యబోతే శివుడు వచ్చి స్పృశించాడు. 
వెంటనే శివుడు పసిపల్లవాడిగా మారిపోయాడు. 

ఆవిడ ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఆనందంతో భర్తకు ఇస్తే, పిల్లాడి రూపంలోనే శివుడు మాట్లాడాడు ఇలా..
"నీవు ఎందుకు కొడుకు కావాలన్నావో నాకు తెలుసు. రాజ్యానికి వారసుడు కోసం కాదు. నీవు చనిపోయాక అంత్యేష్టి సంస్కారం చెయ్యడానికి కొడుకు కావాలనుకున్నావు. 
వరం ఇస్తున్నాను. 
నీకు అంత్యేష్టి సంస్కారం, ప్రతీ సంవత్సరం తద్దినం నేనే పెడతాను" అన్నాడు.

అలాగే రాజు శరీరం విడిచిపెట్టాక అంత్యేష్టి సంస్కారం శివుడే చేసాడు.
ఇప్పటికి ప్రతీ సంవత్సరం పల్లికొట్టుకోట అనే ఊరికి పల్లకీలో "అరుణాచలేశ్వరుడు, అపీతకుచాంబ" ఉత్సవ విగ్రహలను తీసుకువెళ్ళి, 
బ్రాహ్మణులు తద్దిన మంత్రాలను చెప్పి, 
శివుడితో రాజుగారికి తద్దినం పెట్టిస్తారు. 

ఇప్పటికీ భగవంతుడు ఒక సామాన్యుడికి తద్దినం పెట్టడం ఏమిటి? 

అదీ భక్తవత్సలత అంటే. 
ఇంతకన్నా పరమేశ్వరుని కృపకు ఏమి నిదర్శనం కావాలి?

హర హర మహాదేవ్...🙏🏻🙏🏻

పూజ్య గురువుల శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి
ప్రవచనం నుండి సేకరణ....
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹

No comments:

Post a Comment