Thursday, September 22, 2022

తిథి అంటే ఏమిటి? అధిష్టాన దేవతలెవరు?

 Xx7. Xi.   1-6.  200922-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

   తిథి అంటే ఏమిటి?
         అధిష్టాన దేవతలెవరు?
                  ➖➖➖✍️

తిథి అంటే…  వేద సమయగణితము ప్రకారము చంద్రమాసములో ఒక రోజును తిథి అంటారు. 

ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య , అదే సూర్యచంద్రులు ఒకరికొకరు సమానదూరములో వుంటే పౌర్ణమి అవుతుంది. 
శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. 

తిథులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు. రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. 

ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది.

(1) చాంద్రమాసంలో మొదటి తిథి పాడ్యమి. పాడ్యానికి అధిదేవత అగ్ని.
(2) విధియ > బ్రహ్మ
(3) తదియ > గౌరి
(4) చవితి > వినాయకుడు
(5) పంచమి > నాగరాజు

(6) షష్టి > షణ్ముఖుడు
(7) సప్తమి > సూర్యుడు
(8) అష్టమి > రుద్రుడు
(9) నవమి > దుర్గ
(10) దశమి > ఆదిశేషుడు

(11) ఏకాదశి > యమధర్మరాజు
(12) ద్వాదశి > విష్ణు
(13) త్రయోదసి > కాముడు లేదా శివుడు
(14) చతుర్థశి >  కాళికామాత
(15) పౌర్ణమి > చంద్రుడు
(16) అమావాస్య > లక్ష్మి

ఏదైనా కార్యం తలపెట్టినపుడు ఆ తిథికి సంబంధించిన అధిష్టానదేవుడిని పూజించాలి. పూజకు వీలుకాకపోతే మనసులో స్మరించాలి.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment