ఈ క్రింది ఫొటోలో రోడ్డు పక్కన శవమై పడి ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా?
ఆయన పేరు సైరస్ మిస్త్రీ. టాటా గ్రూపుకు మాజీ ఛైర్మన్. ఆస్తి రూ. 80 వేల కోట్లు.
సెప్టెంబర్ 4న గుజరాత్ నుంచి ముంబైకి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురయ్యారు. వెనుక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీ, ఇంకో వ్యక్తి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు.
వారున్నది మెర్సిడెజ్ బెంజ్ GLC 220D. రూ.3 కోట్ల విలువైన లగ్జరీ కారు. ప్రయాణీకుల పూర్తి సేఫ్టీ కోసం ఏడు ఏర్ బ్యాగ్స్ (airbags) ఉన్నాయి. అవి ఆయన ప్రాణాన్నికాపాడలేదు.
ఆయన 80 వేల కోట్ల రూపాయల ఆస్తి ఆయన ప్రాణాన్ని కాపాడలేదు.
అందరి ప్రయాణం ఏదో ఒక సమయంలో ముగుస్తుంది. జీవితాన్ని ఉన్నదానితో ఆనందంగా గడప౦డి. జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు.
మీకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాణ్ణి చూసి ఏడవకండి. ఇంకా ఇంకా సంపాదించాలి, కులపోళ్ళల్లో మేమే నెంబర్ 1, చుట్టుప్రక్కల గ్రామాల్లో మేమే అందరికంటే గొప్పగా ఉండాలి అనే తపనను మానండి.
మీకంటే తక్కువ స్థాయిలో, మీకంటే కష్టాల్లో ఉన్నవాడిని చూసి జీవించండి. సంతృప్తిగా ఉండే జీవితంలో ఉన్న ఆనందం ఎన్ని వేల కోట్లిచ్చినా మార్కెట్లో దొరకదు, ఎవరూ అమ్మరు, అమ్మలేరు.
No comments:
Post a Comment