మన దేశంలో జనాలకి దేవతల పూజలు,ఆరాధనలలో ఉన్న ఆసక్తి ..దేవుడి ధర్మాలు తెలుసుకోవడంలో లేదు.
అందుకే మనకు గుడి, పూజ, కోరిక..ఇవి తప్ప వేరే ఏమీ తెలీదు. ధర్మం అంటే వేద, పురాణ,ఉపనిషత్తులు కావు. ఇవి చెప్పడానికే.. రూప,నామ,క్రియలు లేని పరమాత్మ , శ్రీ కృష్ణునిగా పుట్టి దేవుడి ధర్మాలు తెలిపాడు. ఆయన "కేవలం పరమాత్మను వేడుకో.. అప్పుడు ఆయనలోకి ఐక్యం అవుతావు. అదే మొక్షం " అంటాడు. ఇంత స్పస్టమైన వివరం తెలిపిన పరమాత్మ మాట కాదని...ఇప్పటి స్వామీజీలు చెప్పిన...యాగాలు, యజ్ఞాలు, పూజలు, మొక్కులు, ముడుపులు అని అధర్మాలను ఆచరిస్తున్నారు. ఇవి అధర్మాలని భగవంతుడు గీతలో చెప్పినా.. తెలుసుకొనే సమయం లేని జనాలు అజ్ఞానంతో గుడి, గోపురాలకు వెల్తూ అసలైన దేవుడిని మరచిపోయారు. అందుకే..సమస్యలు, రోగాలు, ప్రకృతి విపత్తులు. ఆకరికి గుడులు కూడా పెరిగాయి. మనశ్సాంతి మాత్రం తగ్గింది. ఎప్పుడు ప్రజలు ధర్మాలను ఆచరిస్తారో.. అప్పుడే మనిషి ఈ కష్టాల నుండి ముక్తి పొందుతాడు.
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఆదర్శ సూత్రం విగ్రహారాధన తగదు దైవం మానుష రూపేణ..... అన్నారు.
ఏ వ్యక్తిని పూజించకూడదు. వ్యక్తులను ఆదరించాలి, ద్రవ్య వస్తువులతో వ్యక్తులను పూజించకూడదు. విగ్రహాలను ప్రతిష్ఠించాలి. ఆ విగ్రహంలో మన రాముని జీవిత చరిత్రను, బుద్ధుని జీవిత చరిత్రను, గుర్తు చేసుకోవచ్చు... చూసుకోవచ్చు.. ఆ విగ్రహాలకు ఆరాధన చేయకూడదు .... పూర్వకాలములో ఫోటోలు లేవు కాబట్టి విగ్రహాలు పెట్టడం జరిగింది. విగ్రహాలు అటువంటివే. ఆ వ్యక్తి యొక్క బోధనలు గుర్తు చేసుకోవడానికి...ఆయన చెప్పిన విషయాలు జీవితంలో ఆచరించడానికి.. విగ్రహాలను పూజించి... ఆ వ్యక్తుల చెప్పిన విషయాన్ని..... ఆ దేవుడు మనకు చెప్పిన విషయాలను వదిలివేసి.... మన ఇష్టం వచ్చినట్లు ఆలోచిస్తే... మన ఇష్టమైన పనులు చేస్తూ... ఉంటే.... దానివల్ల ప్రయోజనం ఏమిటి?. విగ్రహాలు అనేటటువంటివి ఆ వ్యక్తులను ఏమి చేశారో, చెప్పారో... అది గుర్తు చేసుకోవడానికి.... ఆరాధన కు కాదు. ఆరాధిస్తే మన గుణాలు, మన ఆలోచనలు, మన ప్రవర్తనలో ,మన జీవితంలో మార్పు రాదు. ఆ విగ్రహంలోనే వ్యక్తుల జ్ఞానాన్ని స్వీకరిస్తేనే మన జీవితంలో మార్పు వస్తుంది. విగ్రహారాధన, వ్యక్తి యొక్క ఆరాధన, వ్యక్తి కాళ్లకు మొక్కడాలు, పెద్దల ఆశీర్వాదం పొందడం అని చెప్పి ....కాళ్లు కడిగి ఆ నీళ్ళు తల మీద పోసుకోవడం.... అనారోగ్య కరమైన విషయాలు, ఇలాంటి కర్మ కాండలన్నీ తీసేయాలి. ధ్యానశక్తితో ఎవరి స్వంత సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. అనంతమైన శక్తి మన దగ్గర ఉంది. ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. ధ్యానం ద్వారా , పుస్తకాలు చదవడం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా అపారమైన శక్తి ఉందని తెలుసుకుని, మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం. ఎవ్వరూ కూడా మన సమస్యలను పరిష్కరించలేరు. మనం కూడా ఎవరి సమస్యలను పరిష్కరించలేము. ఎవరి సమస్యలు వారే పరిష్కరించుకోవాలి, ఇది కేవలంధ్యానం, జ్ఞానము ద్వారా. మాత్రమే సాధ్యం
క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఆటగాళ్లకు ఎంపైర్ ఏమీ చేయడు. సిక్స్ ఐతే సిక్స్, అవుట్ అయితే అవుట్ అని చెప్తాడు. జీవితమనే ఆటలో మన ఆటకి ఎవరు సహాయం చేయరు, మన ఆట మనమే ఆడాలి.
సేకరణ. మానస సరోవరం 👏
No comments:
Post a Comment