💖💖 *"318"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"పరమాత్మకు ఎవ్వరూ భిన్నంగాలేరని, ఏ విధంగా అవగాహన చేసుకోవాలి ?"*
*************************
*"గోడకు తగిలించివున్న అద్దం, కెమెరాలోని ఫిలిం, ఈ రెండూ తమ ముందున్న విషయాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ రెండింటిలో ఒక తేడా ఉంది. కెమెరాలో ఒకసారి ముద్రితమైన దృశ్యం అలాగే నిలబడిపోతుంది. కానీ అద్దం ఎన్ని దృశ్యాలను ప్రతిబింబించినా అవి దానికి అంటడంలేదు. ఆ అంటని గుణమే దాని పవిత్రత. అద్దానికి ఆ పవిత్ర ఏ దృశ్యం లేనప్పుడే కాదు, అన్ని దృశ్యాలను ప్రతిబింబిస్తున్నప్పుడు కూడా ఆ పవిత్ర అలాగే నిలిచివుంది. అద్దం ముందు నీవు ఎన్ని భంగిమలు ప్రదర్శించినా ప్రతిబింబించే అద్దం, అందులోని ఏ వికారాన్ని తనలో క్షణకాలం కూడా అది అంటుకొని ఉండటంలేదు. మనలో ఆత్మ పవిత్రత కూడా అద్దంతో సమానంగా ఉంది. అద్దంలో ఎలాగైతే పవిత్రత, ప్రతిబింబం ఒకేసారి ఉన్నాయో అలాగే మనలో కూడా క్రియ, నిష్క్రియ ఒకేసారి ఉన్నాయి. కోరికల చేత మనసు ఎంత కలుషితంగా అనిపిస్తున్నా, ప్రాణం యొక్క పవిత్రత మాత్రం మనని అలాగే అంటిపెట్టుకుని ఉంది. కోరికలే మనలో జీవుడిగా, ఆ పవిత్రతే పరమాత్మగా వెలుగొందుతుంది. అందుకే భగవాన్ శ్రీరమణమహర్షి ఎవరూ పరమాత్మకు భిన్నంగాలేరని అన్నారు" !*
*{"ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
No comments:
Post a Comment