*🍁స్వామి వివేకానంద వర్షపు బిందువు గురించి చక్కని వివరణ*🍁
📚✍️ మురళీ మోహన్
💦 ఆకాశంలో నుండి జాలువారిన ఒక నీటి బిందువు గురించి
అది చక్కని చేతులలో స్వీకరించినప్పుడు తాగడానికి
అనుకూలంగా ఉంటుంది.
అది మురికి కాలువలో పడిన మరుక్షణం దాని విలువ దిగజారిపోయి కాళ్ళు కడుక్కోవడానికి కూడా పనికి రాకుండా పోతుంది.
అది వేడి తలంపై పడిన మరుక్షణం ఆవిరైపోతుంది
అది తామరాకుమీద పడిన మరుక్షణం ముత్యం వలె మెరుస్తుంది
అది ఆల్చిప్పలో చేరిన తర్వాత ముత్యంగా మారుతుంది.
నీటి బిందువు ఒక్కటే కానీ అది ఎవరితో అయితే జత కడుతుందో వారి యొక్క స్థానాన్ని బట్టి దాని విలువ మారుతూ వస్తుంది.
అదేవిధంగా నీవు మంచి హృదయము కలవారితో కలిసి ఉన్నప్పుడు నీ స్థాయి పెరుగుతుంది నీ అంతఃచైతన్యం అనుభవంలోకొస్తుంది🙏
No comments:
Post a Comment