Saturday, September 10, 2022

ఎప్పుడు, ఎలా పోతాను?

 ఎప్పుడు, ఎలా పోతాను?

నగరానికి వచ్చిన, పేరు మోసిన జ్యోతిష్యుడ్ని చూడడానికి వచ్చిన రావు గారు, రూ.5,116/-  దక్షిణతో పాటు, తన జాతకం, తన ప్రశ్న కూడా ముందుంచారు.

 "స్వామీ నా మరణం ఎప్పుడు, ఎలా, ఏ పరిస్థితులలో జరుగుతుంది?"

జ్యోతిష్యుడు క్షుణ్ణంగా జాతకం పరిశీలించి, కొన్ని గ్రంధాలు తిరగేసి, చివరికి ఈ విధంగా సెలవిచ్చారు: 

"చూడండి రావుగారు.. మీ జాతకం అత్యద్భుతంగా ఉంది.  స్పష్టంగా తెలియవచ్చిందేమిటంటే మీరు మీ నాన్న గారంత వయసు జీవిస్తారు.  ఆయన పోయిన స్థలంలోనే పోతారు.  ఆయన పోయిన పరిస్థితులలోనే పోతారు."

ఇంకా జ్యోతిష్యుడు చెపుతుంటే వినిపించుకోకుండా రావుగారు పరుగు లంకించుకొన్నారు. దాదాపు అరగంటలోపే రావుగారు తమ తండ్రిని వృద్ధాశ్రమం నుండి ఇంటికి తెచ్చుకొన్నారు.
 😂

No comments:

Post a Comment