Saturday, September 10, 2022

ఈ ఆస్వాదన మరల మరల కావాలనుకోవడం చేత వ్యసనంగా మారుతుంది.

 1)మన ఇంద్రియాలు ( కన్ను ముక్కు చెవి మొ..) ఆరోగ్యంగా వున్నా,బయట వీటి వీటి విషయాలు (దృశ్యం, సుగంధం, శబ్దం)మంచివి వున్నా, మన అంతరంగంలో ఆస్వాదించే సామర్థ్యం లేకపోతే, ఇంద్రియ సుఖాలు అనుభవించ లేము.
జీవితం సప్పగా వుంటుంది.
2) ఇంద్రియ సుఖాలను ఆస్వాదించవచ్చు కాని ,ఈ ఆస్వాదన మరల మరల కావాలనుకోవడం చేత వ్యసనంగా మారుతుంది.
3)ఇలా మారిన వ్యసనం జీవితాన్ని శీల రహితంగా మార్చి దుఃఖితులని చేస్తుంది.
4)కనుక ఆస్వాదన వున్నప్పుడు నేను ఆస్వాదిస్తూ వున్నాను, నాకు ఇది మరింతగా కావాలి అనే కోరిక కలగని‌వ్వక
అప్రమత్తతగా వుండాలి.
5) ఇలాంటి అప్రమత్తతే ధ్యానం.
 ఇట్లు
ఆస్వాదించే వాడు లేని ఆస్వాదన.

No comments:

Post a Comment