💖💖 *"316"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"అనుభవం ఏ విధంగా జ్ఞాపకంగా నమోదవుతుంది ?"*
**************************
*"అప్పుడే పుట్టిన శిశువుకి ఆకలి అయ్యింది. తల్లి పాలు ఇవ్వగానే ఆకలి తీరింది. పాలు త్రాగితే 'ఆకలి తీరటం' అనే ఒక అనుభవం ఏర్పడింది. అది ఒక జ్ఞాపకంగా నిలిచిపోయింది. తిరిగి ఆకలి అయినప్పుడు తల్లి పాల కోసం తహతహ మొదలైంది. అలాగే పెరిగేకొద్దీ.. నీరు త్రాగితే దాహం తీరటం, స్నానంచేస్తే తపన తీరటం వంటి అనుభవాలు ఒక్కొక్కటిగా జ్ఞాపకాలుగా వచ్చిచేరాయి. ప్రతి క్రియలోనూ ఈ శరీరం మరో స్థూల వస్తువుతో కలవటం, అలా కలిసినప్పుడు ఆ వస్తువు ద్వారా మరో కొత్త గుణాన్ని స్వీకరించటం జరుగుతుంది. అది మనలో అనుభవంగా నమోదవుతుంది. అలా నమోదు కావటమే 'జ్ఞాపకం' అయ్యింది. శరీరం మరో స్థూల వస్తువుతో పొందే అనుభవాన్ని మళ్ళీ కావాలనుకోవటం కోరిక. మనకి కోరిక జనించాలంటే ఒక పూర్వానుభవం తాలూకు జ్ఞాపకం ఖచ్చితంగా ఉండితీరాలి. అనుభవాన్ని గుర్తుంచుకుని మళ్ళీ కోరుకునేలా చేసిన దాన్నే 'మనసు' అంటున్నాం !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment