Saturday, September 10, 2022

అది “ఆత్మ” ఆ ఆత్మగా నిలబడిన యోగి శరీరాన్ని సాక్షిగా చూస్తాడు.

 ఓం శ్రీ గురుభ్యో నమః!


ఆత్మకు చావేది, కానీ నేను ఆత్మను చావులేదన్నవాడు గొప్పవాడు నోటితో కాదు అనుభవంలో నేను ఇదీ అని నాకు చావులేదు అన్నవాడు అజ్ఞాంలో ఉన్నవాడు, యోగి ఏం చేస్తాడంటే తాను ఆత్మగా నిలబడి కదిలిపోయి పడిపోయేటటువంటి శరీరాన్ని సాక్షిగా చూస్తుంటాడు, ఆ అనుభవంలోకి వెళ్ళిపోయినవాడి మాట చాలా గమ్మత్తుగా ఉంటుంది, అరె ఏమిట్రా ఈ మాటలు అనిపిస్తుంది. ఒకప్పుడూ రమణ మహర్షి దగ్గరికెళ్లి ఒకాయన రాత్రి బాగా నిద్రపోతారా అని అడిగారు, ఆయన అన్నారు, అవును “ఇది నిద్రపోతుంది” అన్నారు. మరి మీరు అన్నారు, నేను నిద్రపోతున్నదానికి సాక్షిని అన్నారు. ఇది నిద్రపోతూందని నేను తెలివిగా ఉండి చూస్తున్నాను, ఇది లెచిందని నేను చూస్తుంటాను, ఇది కల కంటూందని నేను చూస్తుంటాను దీని మూడు అవస్థలకీ నేను సాక్షిని. నాకు మాత్రం అవస్తలు లేవు ఆ నేను “ఏది యదార్థమైన నేనో” అది నేను. అది “ఆత్మ” ఆ ఆత్మగా నిలబడిన యోగి శరీరాన్ని సాక్షిగా చూస్తాడు.

🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺 

No comments:

Post a Comment