నన్ను నేను ఎలా తెలుసు కోవాలి.??
1) నేను అనేక మందితో సంబంధాన్ని కలిగి వుంటాను. ,ఎవరితో ఎలా సంబంధం కలిగి వున్నానో అదే నేను.
2) నేను వివిధ వస్తువులతో, సంఘటనలతో, సంబంధంలోకి వస్తాను.నా సంబంధాలు వీటి పట్ల ఎలా ఉంటాయో అదే నేను.
3) అనేక సమస్యలు ఎదురవుతాయి.వాటిలిని ఎలా సమీపిస్తూ వున్నాను,ఎలా ఎదుర్కుంటున్నాను ,ఎలా సృష్టించుకుంటుంన్నాను ఎలా పరిష్కరిస్తాను అనేదే నేను.
4) నేను అనేక నమ్మకాలు, విశ్వాసాలు, సిద్ధాంతాలు పెట్టు కుంటా, అలా వేటిని కలిగి వున్నానొ అదే నేను.
5) నాకు కొన్ని బలహీనతలు, బలాలు, సామర్థ్యాలు, విలువలు వుంటాయి.అలా ఏవి వున్నాయో అదే నేను.
6) నాకు కొన్ని ఇష్టాలు, అయిష్టాలు, అభిరుచులు, భ్రాంతులు,కలలు, వుంటాయి.అలా ఏవి వున్నాయో అదే నేను.
7) నేను ఆలోచిస్తాను.ఏమి ఆలోచిస్తూ వుంటానో అదే నేను.
8)నాకొక జీవన శైలి, అలవాట్లు, నిబద్ధతలు, నేర్చుకున్నవి, అంటకట్టినవి వుంటాయి.అవే నేను.
9) నాకు కొన్ని అనుభవాల జ్ఞాపకాలు,జీవితం నేర్పిన పాఠాలు,జీవన గమనంలో ఏర్పడిన చరిత్ర వుంటుంది.అదే నేను.
10) నాకు వంశపారంపర్య లక్షణాలు, స్వభావం, జబ్బులు, వైకల్యాలు వుంటాయి ఇవే నేను.
చివరిగా పై వాటి అన్నింటి తో నేను గుర్తించబడితేనే నేను వుంటాను.లేకుంటే నేను జిరో.
ఇట్లు
ఉనికే లేని నేను.
No comments:
Post a Comment