Sunday, September 11, 2022

ఎవరైనా అనారోగ్యం నుండి కోలుకోవాలంటే, కొంత శాతం మందులు సహాయపడతాయి, అవి కాకుండా మిగిలిన వాటి సంగతి ఏమిటి? *సానుకూల దృక్పథం*

 ఎవరైనా అనారోగ్యం నుండి కోలుకోవాలంటే, కొంత శాతం మందులు సహాయపడతాయి, అవి కాకుండా మిగిలిన వాటి సంగతి ఏమిటి?

*సానుకూల దృక్పథం*

ఈ సంఘటన లండన్‌ లోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. రోగికి ఆపరేషన్ చేయడానికి రెండు గంటల ముందు, ఒక నర్సు అతని గదిలోకి ప్రవేశించి, అక్కడ ఉంచిన పూల గుత్తిని అలంకరించడం, సరిచేయడం ప్రారంభించింది.

చాలా అంకితభావంతో పని చేస్తున్న ఆమె అకస్మాత్తుగా రోగిని "సార్, మీ ఆపరేషన్ ఏ డాక్టర్ చేస్తున్నారు?",అని అడిగింది.
నర్సు వైపు చూడకుండా, ఆ రోగి "డాక్టర్ జాబ్సన్!", అని చెప్పాడు.

నర్సు డాక్టర్ పేరు విని, చేస్తున్న పని ఆపేసి దగ్గరకు వచ్చి, ఆశ్చర్యంతో, "సార్, డాక్టర్ జాబ్సన్ మీకు ఆపరేషన్‌ చేయడానికి నిజంగా అంగీకరించారా?", అని అడిగాడు.

రోగి,"అవును, ఆయనే నా ఆపరేషన్ చేస్తాడు", అన్నాడు.

నర్సు, "చాలా ఆశ్చర్యంగా ఉందే, నేను నమ్మలేకపోతున్నాను!" అంది. 
కంగారుపడుతూ రోగి ఇలా అడిగాడు, "అందులో అంత ఆశ్చర్యపోయే విషయం ఏముంది?"

నర్సు ఇలా చెప్పింది, " ఆయన ఇప్పటివరకు వేల సంఖ్యలో ఆపరేషన్లు చేసారు, 100 శాతం ఫలితాలు కూడా సాధించారు. చాలా బిజీగా ఉంటారు, ఆయన సమయం దొరకడం కూడా చాలా కష్టం. మీ 
ఆపరేషన్ కి సమయం ఎలా కేటాయించారా అని నేను ఆశ్చర్యపోతున్నాను. మీరు చాలా అదృష్టవంతులు."

నర్సు చెప్పిన మాటలు వినగానే పేషెంట్ మొహంలో తృప్తి, సంతోషం వెల్లివిరిసింది. అతను నర్సుతో, "డాక్టర్ జాబ్సన్ నాకు కొంత సమయం కేటాయించి, నాకు ఆపరేషన్ చేయడం నిజంగా నా అదృష్టం", అన్నాడు.

నర్స్ మరోసారి చెప్పింది, "నన్ను నమ్మండి, ఈ ప్రపంచంలోని అత్యుత్తమ వైద్యుడు మీకు ఆపరేషన్ చేయడం నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది!"
 
ఈ సంభాషణ తర్వాత, రోగిని ఆపరేషన్ థియేటర్‌ కు తీసుకెళ్లారు. ఆపరేషన్‌ విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం అతను సంతోషంగా జీవిస్తున్నాడు.

ఆ పేషెంట్ గదికి వచ్చిన మహిళ మామూలు నర్సు కాదు, అదే ఆసుపత్రికి చెందిన మహిళా మానసిక వైద్యనిపుణురాలు, రోగికి అనుమానం కూడా రాని విధంగా రోగులను మానసికంగా తయారుచేయడమే పనిగా పెట్టుకుంది. ఏమాత్రం అనుమానం లేకుండా రోగికి భయం కూడా తొలగిపోతుంది.


ఈసారి, రోగి గదిలో పుష్పగుచ్ఛాన్ని అలంకరిస్తూ, ఆ డాక్టర్ తన పని చేసింది. ఆపరేషన్ చేసే వైద్యుడు ప్రపంచ ప్రసిద్ధి చెందినవాడని, అత్యంత విజయవంతమైన వైద్యుడని, ప్రతీ ఆపరేషన్ విజయవంతంగా చేస్తారని చాలా అందంగా రోగి హృదయానికి, మనస్సుకు భరోసా ఇచ్చింది. వీటన్నింటితో, రోగి స్వయంగా తానే ఒక సానుకూల మార్గంలో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే దిశగా సాగాడు.


దృఢమైన సంకల్పంతో వ్యాధులని అదుపు చేయవచ్చన్న విశ్వాసం ఎంత బలంగా ఉందో, రోగి వ్యాధిని అధిగమించవచ్చని అంతే దృఢంగా ఈ రోజు సైన్స్ రుజువు చేస్తోంది.

ఒక వ్యక్తి ఆందోళనలో, భయంలో జీవిస్తునప్పుడు, విషయాల గురించి భ్రమలు సృష్టించుకోవడం ప్రారంభిస్తాడు. సంయమన స్థితికి చేరుకోవడానికి యోగా మనకు సహాయపడుతుంది. సంయమనమైన, నిష్పాక్షిక హృదయంతో, సంయమనమైన, నిష్పాక్షిక మనస్తత్వంతో, ఒక వ్యక్తి ఏది సరైనది - ఏది తప్పు, ఏది ప్రయోజనకరమైనది - ఏది కాదు అనే దాని మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకుంటాడు.

*సానుకూల ఆలోచనల విస్తరణే యుగపరివర్తన*

- సేకరణ 

No comments:

Post a Comment