ప్రధాన_శత్రువులు
➖➖➖✍️
పుణ్య పాపాల గురించి చాలా మందికి అవగాహన ఉంది. పాపపుణ్యాలు క్రమంగా సత్కర్మలు మరియు దుష్కర్మల ఫలితమని మనందరికీ తెలుసు.
మంచిచెడుల మధ్య తేడాను గ్రహించగలిగినప్పటికీ ఆశ్చర్యకరంగా మానవుడు పాపపు కర్మలలోనే నిమగ్నుడవుతాడు.
ఒకసారి దుర్యోధనుని ఇలా ప్రశ్నించారు. "మీరు మహారాజు, శాస్త్రాలను చదివారు. ధర్మమంటే ఏమిటో తెలుసు. అయినా మీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?”
అప్పుడు దుర్యోధనుడు - "ధర్మమంటే ఏమిటో నాకు తెలుసు. అయినా నా మనస్సు దాని వైపు మొగ్గటంలేదు. అధర్మమూ నాకు తెలుసు. కాని నా మనస్సు పాపకర్మలు ఆచరించటానికే ఇష్టపడుతోంది." అని సమాధానమిచ్చుట ఆశ్చర్యకరమైన విషయం.
శ్రీకృష్ణభగవానుని మాటలను వింటున్న అర్జునుడు… "దేవా ! నీవు బోధించే విషయం తెలుస్తున్నా మనిషి ప్రవర్తన చూస్తే వింతగా అనిపిస్తోంది." అని ప్రశ్నించాడు…
"మనిషికి తాను ఏమి చేస్తున్నాడో తెలిసి చేసినా ఎవరి బలవంతం మీదనో చేస్తున్నట్లు పాపపు పనులనే చేస్తుంటాడు. దానికి కారణమేమిటి?"
దానికి శ్రీకృష్ణ భగవానుని సమాధానం ఇచ్చారు… కామము మరియు క్రోధము, లోభము అనబడు ‘శత్రువులు’ రజో గుణం వలన జనిస్తవి. మహా పాపిష్టమైనవి.
అవే మనిషిని బలవంతంగా పాపానికి ప్రేరేపిస్తాయి.
పైన చెప్పిన విషయం మనకు క్రొత్త కాదు. మనందరికీ సామాన్యంగా తెలిసినదే. అయితే మళ్ళీమళ్ళీ మనం దానిని గురించి చర్చించాలి. ఎందుకంటే మనం దానిని ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాం కదా.
కామం, క్రోధం లోభం అనేవి ప్రతి మనిషికి బద్ద శత్రువులు. మనిషికి మొదట ఇష్టం లేకపోయినా పాపకార్యాలు చేసేటట్లు ఈ రెండూ బలపరుస్తాయి.
కామ క్రోధo , లోభాలను అదుపులో ఉంచుకున్నట్లయితే పాపం చేయాలనే ఆలోచన కలగదు. ఏ వస్తువునైనా తీవ్రంగా కోరుకోవటం కామమైతే, ఆ వస్తువు లభించకపోతే లేదా దానిని కోల్పోతే క్రోధం వస్తుంది.
కామ, క్రోధం , లోభం ఈ మూడు చాలా బలమైనవి. వీటి నుండి బయట పడటం చాలా కష్టం. మానవునికి ఈ మూడింటి వలన మనసు చెడి చేయవలసిన పని చేయకుండా వేరే పని చేస్తారు. వీటి వల్ల ఏ పని చేయాలి/చేయరాదు కూడా తెలియకుండా పోతుంది. ఈ చెడ్డ గుణాలు వలన శుభ్రత, సదాచారo , సత్యము, ధర్మము చెడ్డ వారి యందు కనపడవు.
ఇంద్రియ తృప్తియే ముఖ్యమని వీరు విశ్వసిస్తారు.ఇంద్రియ భోగం కొరకు అధర్మ మార్గంలో పయనించి కడకు పతనము చెందుతారు.
ఈ గుణములవలన అనుకున్న పని జరగక అసూయ కలిగి, కృూరులై ప్రవర్తించెదరు. ఈ ఇలాంటి వారిని నరకమున పడవేతురు.
నరకము నుండి బయట పడాలంటే శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పి నట్లుగా ఆయన మీద విశ్వాసం కలిగి, నిత్యం ధర్మం పాటిస్తూ , అనునిత్యం హరి నామ స్మరణ చేస్తూ వీటి నుండి బయట పడవచ్చు. బయట పడి శాశ్వతంగా ఆ హరి వాసం చేరుతారు.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment