ఐశ్వర్య సాధకులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ క్రింది వ్యాసం తప్పక చదవాలి.ఐశ్వర్యం అంటే ఇంకొక సారి చెప్పుకుందాం.
సంపూర్ణమైన ఆరోగ్యంతో
సంపూర్ణమైన ఆనందంతో
సంపూర్ణమైన సిరి సంపదలతో
సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవించడమే ఐశ్వర్యం.
మరి జీవించడానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి.
ధర్మం అంటే ఏమిటి?
మనిషి సంఘ జీవి. వంటరితనం ఇష్ట పడడు. సంఘంలో ఉన్న మానవ, పశుపక్ష్యాదులకు, నాలుగు వర్ణాశ్రమాలలో జీవించే వారికి, పేద బడుగు బలహీన వర్గాలకు స్తీలకు, సమస్త ప్రాణి కోటికీ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చేయదగిన కర్మను ధర్మబద్దమైనది అంటాము. ఒక్క మాటలో చెప్పాలంటే ఆచరించదగినది ధర్మం. ఆచరింపతగనిది అధర్మం.
ధర్మా ధర్మాలు ఆచార ప్రకటితాలు. ఆచారం మత సమ్మతం. దేశ కాల మాన పరిస్థితులను బట్టి మతా చార అలవాట్లు, కట్టుబాట్లు మార్పు చెందడం పరిపాటి. కాలచక్రంలో సౌలభ్యం కొరకు కాలాన్ని యుగాలుగా పేర్కొంటారు. ఒక యుగంలోని ధర్మాన్ని ఆ యుగధర్మం అంటారు.
మనిషి ఎలా బ్రతకాలి, దర్మాచరణ అనగానేమి ఇత్యాది వివరణలు తెలిపేందుకు మనకు ఉత్కృష్టమైన గ్రంథాలు ఉన్నాయి. మానవ సంబంధాలు, విలువలు తెలియజేయడానికి రామాయణ కావ్యం. ఇది ఒక కుటుంబం లోని వ్యక్తుల సంబంధ, విలువలే కాకుండా మనిషి ఎంత వరకు ధర్మ బద్దంగా జీవించగలడో అంత, వివరణ వచ్చే విధంగా జీవించి చూపించాడు భగవంతుడు రామావతారంలో. మనుష్యుడిగానే చేసి చూపించాడు. అదే కావ్య రూపంలో మనకు రామాయణం. ఆది కావ్యం. వాల్మీకి విరచితం.
ఇక సంఘజీవనంలో రాజకీయ, లౌకిక విషయాలను భక్తి యుక్తంగా మనకు తెలియచేసేదే మహాభారతము. ఇది ఇతిహాసం. అంటే జరిగిన కథ. పరమేశ్వరుడు ఈ యుగంలో చమత్కారమైన జీవనయానం చూపించాడు. భక్తి, యుక్తి, సాహసం, పౌరుషం, దానం, ధర్మం, వైరాగ్యం, మోక్షం, ప్రేమ, వ్యామోహం, కక్ష, కుతంత్రం ఇత్యాది గుణాలన్నింటినీ చూడవచ్చు. భగవంతుడు సాక్షీభూతమై ఇవన్నీ మానవజన్మలో ఉంటాయి అని తెలిపే గ్రంథరాజమే మహాభారతం అనబడే ఇతిహాసం.
ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. రామాయణ కాలంలోని మానవ సంబందాలు మహాభారత కాలంలోనూ ఉన్నాయి. కౌరవ, పాండవులు మిగిలిన వారు అందరూ పాటించారు. పాటించని వారూ ఉంటారు. ఉదాహరణకు పిత్రు వాక్య పరిపాలన, అగ్రజుని మాట వినడం, పతివ్రత లక్షణాలు మెదలైనవి గమనించవచ్చు. కనుక మన రెండు గ్రంథాలు మనిషి జీవన విధానం ఎలా ఉండాలో తెలుపుతాయి. జీవితంలో ఏ సమస్యకైనా సమాధానం ఈ ఉద్గ్రందాలలో దొరికి తీరుతుంది.
ఇక మిగిలింది మోక్షం. ఆత్మ విచారణ. ఇది సాధించాలంటే భాగవత పురాణ పఠణం చేయాలి. వ్యాస భగవానుని విరచితం ఈ పురాణ గ్రంథం. భగవంతుని కథతో పాటే సృష్టి రహస్యాలను అనంతుడి లీలా విలాసాలను కాలచక్ర వివరాలను ఈ భాగవతం మనకు తెలుపుతుంది. శ్రద్దగా చదివితే లేదా పురాణ పఠణం వింటే దాదాపుగా మన సందేహాలు అన్నీ నివ్రుత్తి అవుతాయి. జన్మాంతర సుక్రుతమే భాగవత పఠణం అంటారు.
ఏ గ్రంథాన్ని చదివినా, ప్రవచనాన్ని విన్నా అందులోని సారాన్ని గ్రహించి మన ప్రస్తుత పరిస్థితులను తదనుగుణంగా అన్వయించుకోవాలి. అది మనకోసం కాదు అనుకోకూడదు. అవన్నీ మన కోసమే. అర్థమైతే అది మనదే, కాకుంటే మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి.
ఈ గ్రంధాలు మనకోసం కాదు, పూర్వీకుల కోసం లేదా మనకోసం కాదు ముసలివారికోసం అని మాత్రం అనకూడదు.ఎందుకంటే ముసలివారు అన్ని అనుభవాలు
పొందినఉన్నవారు. వారికి జీవితం యొక్క విలువ ఎంతో తెలిసినవారు.ఇక తెలియవలసినది , ఇప్పటి తరం వారికే.... ఎందుకంటే మన యొక్క భారతీయ సంస్కృతిని మరచి పాశ్చాత్య మోజులో పడి, కట్టు, బొట్టు,మార్చుకుని మన ధర్మం కానీ దానిని మనదీ అనుకుంటూ జీవిస్తూ, మన ధర్మం ఏమి చెప్పిందో,ఎలా పనికివస్తుందో తెలియని స్థితిలో బ్రతుకుతున్న అభాగ్యులము. ఇప్పటి తరానికి జీవితం పట్ల ప్రేమ లేకపోవడం, మరి పెద్దవారి పట్ల గౌరవం లేకపోవడం, మరి గురువుల పట్ల భక్తి లేకపోవడం మొదలగు చాలా విచారించ తగ్గ విషయాలు.
ధర్మంగా బ్రతుకుదాం, ధర్మంగా జీవిద్ధం, ధర్మంగా సంపాధిద్దం.నిరంతరం ఆత్మజ్ఞానంతో జీవిద్దాం తరిద్దాం.ఇంకా ఉంది.......
మీకు ఏమైనా సందేహాలుంటే సంప్రదించ వచ్చు.
మీ
SHREE SWAMI NARAYAN
Spiritual scientist
Baaratiya Vaidya vidhaan
9704852146
9849438299
No comments:
Post a Comment