080922a2201. 090922-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀628.
నేటి…
ఆచార్య సద్బోధన:
➖➖➖✍️
"యుగాలు గడిచినా, తరాలు మారినా సనాతన ధర్మం అనేది మార్పు చెందేటటువంటిది కాదు.
నాటి నుండి భారతీయులు సనాతన సంస్కృతి, సంప్రదాయాలు , ఆచార వ్యవహారాలును చక్కగా పాటిస్తూ వచ్చారు.
కానీ నేడు ఎవరైతే వాటిని కాపాడుకోవాలో వాళ్ళే వాటిని నాశనం చేస్తున్నారు!
ముఖ్యముగా సనాతన ధర్మ రక్షణలో ముఖ్యపాత్ర పోషించవలసిన స్త్రీలు నేడు వాటిని పక్కన బెట్టి పరదేశి అలవాట్లకు ఆకర్షితులు కావడం చాలా బాధాకరం!
స్త్రీలు దేశానికి, సమాజానికి, సంస్కృతి సంప్రదాయాలకు వెన్నెముక వంటివారు. వారిలో ఉండే అసలైన శక్తి తెలుసుకోలేక పోతున్నారు.
వేయి మంది పురుషులులో ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఒక్క స్త్రీలోనే ఉంటుంది. తాను తలచుకుంటే ఈ ప్రపంచాన్ని అంతా ఒక చుట్ట మాదిరి చుట్టేయగలదు.
దేశము, సమాజం సుఖ శాంతులతో ఉండవలెనంటే స్త్రీలు తమ ఆచార వ్యవహారాలు చక్కగా పాటించాలి. సనాతన సంప్రదాయాలు ఆచరించి ప్రపంచానికి ఆదర్శమునందించాలి.
ఈ విషయములో పురుషులు స్త్రీలకు చక్కగా సహకరించాలి. వారికి తగ్గ గౌరవమునివ్వాలి. వారికి సరైన విధముగా రక్షణ కల్పించి కాపాడుకోవాలి.
అప్పుడే దేశమునకు, సమాజానికి మంగళం కలుగుతుంది. తద్వారా ప్రపంచం సుఖ శాంతులతో ఉండగలుగుతుంది."✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment