*మానవ జన్మ*
మానవ జన్మ విత్తనం వంటిది. విత్తనానికి పూర్వం చెట్టు ఉంది, విత్తనం తరువాత కూడా చెట్టు ఉండొచ్చు! అయితే విత్తనము తరువాత చెట్టు ఉండాలా లేదా అనేది విత్తనం సామర్ధ్యం మీదా అధారపడి ఉంటుంది.
విత్తనములో మొలకెత్తే గుణం ఉన్నట్లయినా అది మొక్కగా మారి పెద్ద వృక్షం అవుతుంది. మళ్ళీ విత్తనాలు పుట్టి మళ్ళీ చెట్లు.. ఇలా విత్తనం, చెట్టు తిరుగుతూ ఉంటాయి.
మన జన్మలు కూడా ఇంతే! గత జన్మలో ఉన్నాం. ఇప్పుడు కూడా ఉన్నాం. ఇక ముందు కూడా ఉండవచ్చు.
అయితే ఇక ముందు జన్మ ఉండాలా, లేదా అనేది నేటి మన సాధన మీద ఆధారపడి ఉంది!
విత్తనంలో మొలకెత్తే గుణం ఉన్నంత వరకూ అది మొలకెత్తుతునే ఉంటుంది. ఆ మొలకెత్తే గుణం లేకపోతే ఎంత మట్టి వేసినా, ఎన్ని నీళ్ళు పోసినా మొలకెత్తదు.
అలానే మనలో ఉండే అజ్ఞాన, అహంకార, మమకారాలు ఉన్నంత వరకూ చావు పుట్టుకల చక్రంలో తిరుగుతూనే ఉంటాం.
మనలో ఇవి ఎప్పుడైతే నశించుకుపోతాయో అప్పుడు సహజముగానే పునర్జన్మ నుండి విముక్తులం అవుతాం.
వీటిని వదలడం అంత సులువైన పని కాదు! అలా అని కష్టమూ కాదు. నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే మనసులో ఒక విధమైన కంపనం కలిగి అజ్ఞాన, అహంకారమమకారాలు క్రమేపీ తగ్గుముఖం పడతాయి.
అలా నిరంతరం చేస్తూ చేస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో ఆ గుణాలు పూర్తిగా నశించుకుపోతాయి. ఇక ముక్తికి మార్గం దొరికినట్లే!
అంతవరకు గట్టి సాధనే చేయాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా మద్యలో ఆపడానికి వీల్లేదు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయతను కూడా నేర్పిద్దాం.
No comments:
Post a Comment