🌺🙏జై శ్రీ కుసుమహార🙏🌺
🌴 మానవుని గుణాలు చాలా వరకు తాము తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటాయి. ఫుడ్ ను బట్టి హెడ్, హెడ్ ను బట్టి గాడ్.. కనుక దైవానుగ్రహమునకు సాధన చేయువారు, నిజముగా తమ ఆత్మోద్ధరణ కోరుకొనువారు సాత్విక ఆహారం తీసుకోవడం చాలా అవసరము మరియు మంచిది కూడానూ. ఈ ఆహారము కూడా దైవర్పణము చేసి తీసుకోవాలి. ఆహారము సాత్వికమైనది అయిననూ అది పండే ప్రాంతం, వండే మనిషి, వంట పాత్ర, మున్నగు వాటి ప్రభావము ఆ ఆహారము మీద పడి, తద్వారా తినేవారికి ప్రభావితం చేస్తుంది. కనుక ఆహారము తినే ముందు దేవునికి నివేదించి, కృతజ్ఞతలు చెల్లించి తినాలి. దాని వలన ఆహరములో ఉండే దోషాలు తొలగిపోయి పూర్తిగా సాత్వికంగా , ప్రసాదముగా మారిపోతుంది . తద్వారా మంచి గుణాలు అలవడి మంచి కర్మలు జరుగుతాయి. మంచి కర్మల వలన మంచి ఫలితాలు వస్తాయి. సాత్విక కర్మలే దేవుణ్ణి మెప్పిస్తాయి కనుక సులభంగా దైవానుగ్రహం పొందవచ్చు. కచ్చితంగా జన్మలను ధన్యం చేసుకోవచ్చు.🌴
No comments:
Post a Comment