Saturday, September 17, 2022

శక్తికంటే సహనం గొప్పది. శక్తితో జయించలేనిది సహనంతో జయించగలం.

 🕉 శ్రీ గురుభ్యోనమః


            శక్తికంటే  సహనం  గొప్పది.  శక్తితో  జయించలేనిది  సహనంతో  జయించగలం.  

            మీకు  కనిపించే  వారిలో  చెడ్డ  పని  చేసినవారు  ఎవరైనా  ఉంటే,  వాళ్ళను  చూడటానికి  మీరు  అయిష్టత  కల్పించుకోకండి.  వారిని  చూచే  స్ఠితి  భగవంతుని  ప్రణాళికలో  ఉంటే,  మీరు  నిర్మలంగా  చూడగలిగితే  మీ  ప్రారబ్ధం  ఖర్చు  అవుతుంది.

            ఎల్లవేళలా  పవిత్రమైన,  నిర్మలమైన  ఆలోచనలు  వచ్చేటట్లు  చేసుకుంటే  మీ నాలుకను  భగవంతుడు  వాడుకుంటాడు.

            మీరు  దేవుడు  లేడని  చెప్పినా  నాకు  ఇష్టమే  కానీ,  మీ  ఆత్మ  విశ్వాసంపై  విమర్శ  పడకుండా  జాగ్రత్త  పడండి.  మీరు  ఏ పని  చేసినా  మనస్ఫూర్తిగా  చేయండి.  పిరికితనంగా  చెయ్యకండి.  

            అహంకారం - కర్మయోగం,  జ్ఞానయోగం,  భక్తియోగాల  వలన  పూర్తిగా  నశించదు.  గురువు  యొక్క  దయ  అనే  స్పర్శ  లేకుండా  అహంకారం  కదలదు  మెదలదు  అలాగే  ఉంటుంది.

            అది   గురువు  యొక్క  ప్రేమ  స్పర్శ  వలన  మాత్రమే  నశిస్తుంది.

             మీ సద్గురువును  ప్రేమగా  తలచుకుంటే  చాలు,  మీ సాధన  జయప్రదమవుతుంది.


  🙏 సద్గురు  శ్రీ నాన్నగారు 🙏


🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺

No comments:

Post a Comment