🔺 *పత్రీజీ సమాధానాలు*🔺
🌹 *చాప్టర్ --13:--- స్వీయ నిర్వహణ* 🌹
🍁 *ప్రశ్న :--- బాధలతో స్నేహం చేసే ఉత్తమ మార్గం ఏది? నా నెగెటివ్ ఎమోషన్ని ఆరోగ్యకరంగా విడుదల చెయ్యటం ఎలా? మరి వాటిని మానవ సహజ భావోద్వేగాలుగా గుర్తించటం ఎలా?*
🍀 *పత్రీజీ :---* బాధలను మచ్చిక చేసుకుని, స్నేహం చేసుకుని, అర్థం చేసుకుని ప్రాథమికంగా వాటిని అనుమతించటం ద్వారా అంతర శక్తిని, దానిని సహజంగా అనుసరించే ఆనందాన్ని అనుభూతి చెందవచ్చు. దీనికంతటికీ దోహద పడే అత్యుత్తమ సాధనమే ధ్యానం.
🌸 బాధ అనివార్యం, ఏదో ఒక రూపంలో అది ఎప్పుడూ ఉంటుంది. ఈ ప్రపంచంలో మీరు ఉన్నంత కాలం అది తప్పదు. ఈ ప్రయాణంలో మన పని ఏమిటంటే బాధతో, నొప్పితో స్నేహం చెయ్యటం ఎలా అని తెలుసుకునే మార్గం కనుక్కోవటం. ఎందుకంటే బాధ మనకు ఎంతో బోధిస్తుంది. మొదట మీతో మీరు క్రమ శిక్షణతో, నిజాయితీతో ఉండటం ద్వారా బాధతో స్నేహం చెయ్య వచ్చు. అది కాకుండా మరో దారి లేదు గాక లేదు. మీ ధ్యాన ప్రయాణం అదే నేర్పుతుంది.
🌳ధ్యానం మీ ఆత్మ శక్తిని పెంచుతుంది. దేహదారుఢ్యం కండరాలపైన ఆధారపడి ఉంటుంది. మరి ఆత్మ శక్తి మీరు చేసే ధ్యానంపైన ఆధారపడి ఉంటుంది. శరీరంలో కండలు పెంచటానికి మీరు శారీరక వ్యాయామాలు చెయ్యవలసి ఉంటుంది. అయితే ఆత్మ శక్తిని పెంపొందించుకోవటానికి మీరు ధ్యానం చెయ్యవలసి ఉంటుంది. ధ్యానం అంటే మనస్సుకు ప్రశిక్షణ ఇవ్వటం. మనస్సుకు క్రమశిక్షణ అలవాటు చేసి తీరాలి.
🌿 మీరు మీ మనస్సుకు ప్రశిక్షణ ఎలా ఇస్తారు? ధ్యానం ద్వారా, ఏమీ ఆలోచించకుండా ఉండటం ద్వారా ఇస్తారు. కేవలం శ్వాసను గమనించటం ద్వారా ఆలోచనలను అదుపు చేసి మనస్సుకు శిక్షణను ఇస్తున్నారు. ధ్యానం అంటే ఇదే, మనస్సుకు ప్రశిక్షణ ఇవ్వటం. లేదంటే మనస్సు ఎక్కడెక్కడికో పరుగులు తీస్తుంది. అంతటా వ్యాపిస్తుంది. ధ్యానం అలా చెయ్యకుండా నియంత్రిస్తుంది.
🏵️ ఒక వికృతమైన మనస్సును విశ్లేషించటం వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు. వికృతమైన మనస్సు కాస్తా అద్భుతమైన ప్రశాంతమైన మనస్సుగా మారాలి. మరి అది ఆనాపానసతి ధ్యాన సాధన ద్వారానే సుసాధ్యం అవుతుంది. గత్యంతరం లేదు గాక లేదు గాక లేదు.
🌹 ధ్యానం అంటే ఏ విశ్లేషణలూ చెయ్యకుండా ఉండటం. నేను నేనే. మీరు మీరే. మిమ్మల్ని మీరుగా నేను అంగీకరిస్తున్నాను. నేను మిమ్మల్ని విశ్లేషించను. నన్ను నేను ఉన్నదున్నట్లుగా అంగీకరిస్తున్నాను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *పత్రీజీ సమాధానాలు పుస్తకం* మరియు ఇతర *పత్రీజీ పుస్తకాల సెట్* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.
No comments:
Post a Comment