Friday, December 23, 2022

మంచి మాట...లు (23-12-2022)

 ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. లక్ష్మీ దుర్గ గాయత్రి సరస్వతి అమ్మవార్ల  అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ... 
💐🤝
*శుక్ర వారం --: 23-12-2022 :--ఈరోజు *AVB* మంచి మాట...లు 

      మనషికి *ఆశకు* అంతముండదు *పైసాకు* పద్దతుండదు *ఈ రెండిటి* వెనకాల పరిగెత్తేటోడికి *మనః శాంతి* ఉండదు

.      ఇది గుర్తుపెట్టుకో నేస్తమా ! మనం *సంపాదన* వేటలో పడి *జీవితాన్ని* ఆనందంగా గడపడం మరిచిపోతున్నాం జరిగిన *కాలాన్ని* కొనలేం తరిగిన *వయస్సును* తిరిగి పొందలేం

.     అందుకే *ప్రతి క్షణం* ఆస్వాదిస్తూ *సంతోషంగా* గడపడానికి ప్రయత్నిద్దాం మంచి  *మనస్తత్వo* కలిసిన వారిని *వదులు* కోకూడదు *మానవత్వం* తెలియని వారిని *కలుపుకోకూడదు* అనుభవం నేర్పిన *పాఠాలకు* విలువ ఎక్కువ ఆచరిస్తూ *చెప్పే* మాటలకు *ఆదరణ* ఎక్కువ

.       *ఇష్టంతో* చేసే పనులకు *విజయాలు* ఎక్కువ, ఎదుటి వారిలో *మంచినే* చూసే వారి *మనసుకు* ప్రశాంతత ఎక్కువ .

     *దీపం* విలువ *చీకట్లో* తెలుస్తుంది *డబ్బు* విలువ *పేదరికంలో* తెలుస్తుంది కుటుంబం విలువ *ఒంటరితనంలో* తెలుస్తుంది ,

.       ఏ *జన్మలో* ఏ *పాపం* చేసామో తెలియదు *కానీ* ఈ *జన్మలో* ఎంత *ఓర్పు* సహనంతో అన్నింటిని సహించుకుపోతున్న, *కష్టాలు* మాత్రం తప్పడం లేదు ,అయినకాని సంతోషం గా అనుభవిద్దాం కష్టాలను.

     ఏ *జీవితం* ఎవరికి *శాశ్వతం* కాదు ఈ *ప్రపంచంలో,*  ఏ *ప్రాణానికి* గ్యారంటే లేదు మనం *జీవించే* కొంత *కాలానికి* ఎన్నో *బాధలు బంధాలు బాధ్యతలు* ఎవరై్నా చనిపోతే *పాపం* పోయాడు అంటాము *బతికి* ఉంటే ఇంకా *పోలేదా* అంటాము, *రేపు* అనేదాని *చూస్తామో చూడమో* తెలియని మన బతుకులకు *పగలు కక్షలు పంతాలు* ఎందుకు నేస్తామా ! ఎవరూ ఉండి *తినేది* లేదు ఎవరూ పోయి *సాధించేది* లేదు ఉన్నంత కాలంలో అందరితో *కలిసి సంతోషంగా జీవిద్దాం* . 

   సేకరణ ✒️*మీ... AVB సుబ్బారావు ..*

No comments:

Post a Comment