Tuesday, December 20, 2022

దత్తాత్రేయుని 24 మంది గురువులు.

 *🍁దత్తాత్రేయుని 24 మంది గురువులు.🍁*

📚✍️ మురళీ మోహన్
_*బంధుమిత్రులoదరికి దత్త జయంతి శుభకాంక్షలు*_

🙏యాదవ వంశానికి మూలపురుషుడైన యదువు అనే రాజు దత్తాత్రేయుని చూచి స్వామీ మీరెలా సదానంద, చిదానంద స్వరూపులై ఉండ గలుగుతున్నారు అని ప్రశ్నించగా అప్పుడు దత్తాత్రేయుల వారు ఇలా సెలవిచ్చారు.

యదు రాజా ! నేను సమస్త ప్రకృతిని పరిశీలించి అన్నింటి నుండీ జ్ఞానం సంపాదించాను. చెప్తాను విను.

ప్రకృతిలో నాకు 24 మంది గురువులున్నారు. కొన్నింటి నుండి ఎలా ఉండాలో తెలుసుకున్నాను, కొన్నింటి నుండి ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను. 

ఆ విధంగా తానే స్వయంగా దేవతలు, రాజులు, మహర్షులకి ఎందరికో గురువైనప్పటికీ, అహంకారం లేకుండా సృష్టిలోని ప్రతీ అణువు నుండి నేర్చుకుంటూ శిష్యుడు కూడా అయ్యాడు.

జగత్తుకూ, ప్రకృతికీ తానే గురువైనా మనందరిలో ఙ్ఞానమనే జ్యోతిని వెలిగించడానికి జగద్గురువైన దత్తాత్రేయ స్వామి ప్రకృతిలోని 24  తత్త్వాలను తన గురువులుగా ప్రకటించుకున్నారు అవి...
1)🎇 ఆకాశం
2) 🌏భూమి
3) 🔥అగ్ని
4) 💦జలం
5) 🌬️వాయువు
6) 🌞సూర్యుడు
7) 🌝చంద్రుడు
8)🐦 పావురం
9) 🐍కొండ చిలువ
10) 🐝తేనెటీగ
11) 🦋భ్రమరం ( తుమ్మెద )
12) 🌊సముద్రం
13) 🦅రాబందు
14) 🕷️సాలీడు
15)🐘 ఏనుగు 
16) 🦌జింక
17) 🐟చేప 
18) 👼పసి పిల్లవాడు
19) 🧏‍♀️కన్య 
20) 🐍పాము
21) 🤠లోహపు పనివాడు
22) 🐻ఎలుగుబంటి
23) 🧛‍♀️వేశ్య
24) 🦗చిమ్మట

ఇవన్నీ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు , పంచ తన్మాత్రలు, మిగిలిన నాలుగు మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారాలకు ప్రతీకలు. ఆ ఙ్ఞానమూర్తి అవ్యక్త రూపంలో వీటన్నిటిలో ఉన్నట్టుగా చెప్తారు.

ఈ ప్రకృతి తత్త్వాలను దత్తాత్రేయుడు ఎలా గురువుగా  స్వీకరించాడో... తెలుసుకుందాం.

🕉🌞🌏🌙🌟🚩

*1. మొదటి గురువు* - 🌏భూమి:-

దత్తాత్రేయుడు తాను భూదేవి నుండి ఓర్పు వహించడం, కర్తవ్య నిర్వహణా ధర్మం, కార్య నిర్వహణలో ఎన్ని కష్టానష్టాలు వచ్చిన ఓర్చుకోని నిలబడడం, తన ధర్మం తాను తప్పకపోవడం లాంటి ఎన్ని విషయాలనో తాను గ్రహించానంటాడు జగద్గురువైన దత్తాత్రేయుడు. భూదేవి కన్నా ఓర్పు ఈ విశ్వంలో ఎవరికి ఉంటుంది. మానవుడు దుర్మార్గుడు ఎన్ని అకృత్యాలకు పాల్పడినా ఓర్పు వహించి భరించేదే భూమాత.

మనం ఎన్నో తప్పులు చేసి భూదేవిలో భాగమైన ఈ ప్రకృతి నడిచే సక్రమమైన వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసి ఉత్పాతాలు సృష్టించినా ఉపేక్షించి, కొడుకు ఎన్ని తప్పులు చేసినా కన్నతల్లి తన కడుపులో దాచుకున్నట్టు, ఓర్పుతో మనని ఉద్ధిరించే ప్రయత్నం చేస్తుంది తల్లి భూదేవి. ఇంకా భూదేవి నుండి నేర్చుకోవాల్సిన గుణం క్షమా గుణం.

భూమిపై ఉండే పర్వతాలు మరియు వృక్షాల లాగా ఇతరులకు ఎలా ఉపయోగపడాలో నేర్చుకోవలంటాడు దత్తాత్రేయుడు.🤘

No comments:

Post a Comment