Monday, December 19, 2022

పెద్దల మాటలు అమృతంతో సమానం అంటారు . వారి హితవచనాలు పాటిస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

 పెద్దల మాటలు అమృతంతో సమానం అంటారు . వారి హితవచనాలు పాటిస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

పెద్దలు, అనుభవజ్ఞులైనవారి హితవచనాలు మంచి పనులకు ప్రేరణ కలిగిస్తాయి. మనిషిని మంచి మార్గంలో నడిపిస్తాయి. 'వినదగునెవ్వరు చెప్పిన' అని బోధిస్తాడు. శతకకర్త వేమన. పెద్దరికం అంటే అనుభవం, జ్ఞానం అనే సంపదలతో తులతూగే వ్యక్తిత్వం. సంస్కారం కలవారు పెద్దలు ఎదురుపడగానే నమస్కరిస్తారు. మనిషి దేన్ని సాధించాలన్నా అనుభవజ్ఞులైనవారి సలహాలు, సూచనలు తప్పనిసరి.. పెద్దలు చెప్పే సూక్తులు మనసులో నిక్షిప్తమై మనిషిని సరైన మార్గంలో ప్రయాణించేలా చేస్తాయి. మనిషి బతుకును తీర్చిదిద్దుతాయి.

రామాయణంలో ఆదర్శ పురుషుడు, పితృభక్తుడు అయిన శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞలను పాటించడమే ధర్మాచరణగా భావించాడు. ఎవరి మాటనైనా శ్రద్ధగా వినేవాడు. తనవారిని సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకునేవాడు కాదు. భారతంలో ధర్మరాజు చక్కని శ్రోత, కనిపించిన ప్రతి పెద్దమనిషినీ మంచిమాటలు చెప్పమనేవాడు. వారు చెప్పిన హితోక్తుల్ని తన ప్రవర్తనలో ఇముడ్చుకునేవాడు.

పుస్తక జ్ఞానంకన్నా అనుభవ జ్ఞానం గొప్పది. అనుభవం పాఠాలను నేర్పుతుంది. పెద్దలు తమతమ జీవితానుభవాలు రంగరించి పిన్నలకు సల హాలు, సూచనలు ఇస్తారు. వాటిని పాటించి వారు దర్శమార్గంలో నడవాలి.

పూర్వం మహారాజులు, చక్రవర్తులు కూడా తమ పాలనను, ప్రవర్తనను సమీక్షించుకునేందుకు విడిగా కులగురువులు, మహర్షుల వద్దకు వెళ్ళేవారు. వారిని ఆశ్రయించి సూచనలను స్వీకరించేవారు. చివరకు సామాన్య ప్రజల అబి ప్రాయాలూ తెలుసుకుని తమ పాలనను విశ్లేషించు కుంటూ లోపాలను సరిదిద్దుకునేవారు. అందుకే ఎవరి దగ్గర గొప్ప ఆలోచనలు ఉన్నా స్వీకరించమని మనుస్మృతి చెప్పింది. ఆదర్శనీయమైన విలువల్ని ఆచరించమని బోధించింది.
మూర్ఖుడికి ఎలాంటి హితోక్తులు చెప్పినా వ్యర్ధమే. అతడు తనకు తోచినట్లే వ్యవహరించి వినాశనాన్ని కోరి తెచ్చుకుంటాడు. సీతాపహరణకు పాల్పడిన రావణుడితో విభీషణుడు 'అన్నా! అనవసరంగా పోరు తెచ్చుకొంటున్నావు.. ఇందులో మన సోదరి శూర్పణబడే తప్పు... ఆమె మాటల్ని నమ్మి నువ్వు సీతాదేవిని అపహరించుకు రావడం ఆధర్మం. రాముడితో యుద్ధం సామాన్యం కాదు. సీతను మళ్ళీ రాముడి వద్దకు చేర్చి ఆయనను శరణు వేడుకో" అని హితవు పలుకుతాడు.

తమ్ముడి మాటలతో రావణుడిలో కోపం తారస్థాయికి చేరుకుంది. "నువ్వు శత్రుపక్షపాతిని' అంటూ విభీషణున్ని నిందించి దేశం నుంచి వెళ్ళగొట్టాడు. చివరకు తన వినాశనం తానే కొని తెచ్చుకున్నాడు. వినేవాడు వివేకవంతుడైతే తన తప్పు తెలుసుకుంటాడు. తనను తాను సరిదిద్దుకుంటాడు. బుద్ధిహీనుడు అపార్ధం చేసుకుంటాడు అంటారు పెద్దలు.

'నీ జీవితాన్ని శ్రేయో మార్గం వైపు నడిపే దేనినైనా ఎలాంటి భేషజం లేకుండా వెంటనే అంగీకరించు' అంటారు స్వామి వివేకానంద. పెద్దల మాటలు అమృతంతో సమానం. అవి మన జీవితాలకు దిశానిర్దేశం చేస్తాయి. ఆ హిత వచనాలను వివేకంతో అర్ధం చేసుకుని వాటిని మన జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే కోరుకున్న లక్ష్యాలను చేరుకుంటాం. దానికి కావలసినది శ్రద్ధ, అవగాహన.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment