వినేవారు కొందరు ఉంటే చెప్పేవారు మరికొందరు... చెప్పేది సత్యంగా, స్వచ్చంగా వినేవారికి ఉపయోగకరంగా ఉండాలి... అపుడు మాత్రమే చెప్పేవారికి వినే వారికి లాభదాయకంగా ఉంటుంది.. సాధన చేసేదే సమస్యల నుండి విడుదల కొరకు... జ్ఞానాగ్ని కర్మ దగ్దానాం అనేది విని.... అది కోరిక అవుతుందా... పుట్టిన దగ్గర నుండి పోయేవరకు ఈ ప్రపంచం నడిచేది కోరికల మీదే... నేను పాకాలి, నడవాలి, చదువు కోవాలి, ఉద్యోగం, వ్యాపారం చెయ్యాలి, వివాహం చేసుకోవాలి, పిల్లలను కనాలి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి ఇలాంటి వాటిని కోరికలు అంటారా? అవకాశం ఉందని, ఇచ్చారని గంటలు గంటలు ప్రసంగాలు కాదు కావలసింది,ధ్యానం ఎలా చేయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎపుడు చేయాలి, చేసినవారికి ప్రయోజనాలు ఏమిటి మొదలగు విషయాల గురించి చెప్పండి అపుడు అందరికీ ఉపయోగకరం... నోటి నుండి వచ్చే ప్రతి మాటా వినేవారికి ఉపయోగకరంగా ఉండాలి... అందరి సమయం విలువైనదే... విలువైన సమయాన్ని అనవసర ప్రసంగాలతో దుర్వినియోగం చేసేవారు కూడా శిక్షకు అర్హులే... ఎందుకంటే అతి విలువైనది, డబ్బుతో పలుకు బడితో కొనలేనిది, మార్కెట్ లో దొరకనిది సమయం మాత్రమే... గంటల్లో చెప్ప వలసిన విషయం గంటలు గంటలు, రోజులకు రోజులు ఎందుకు? రాత్రి జీవితం, పగలు జీవితం, వారం వారం జీవితం, మరణాంతర జీవితం, పాత శక్తి, కొత్త శక్తి ఎవరికి కావాలి? అందరికి కావలసింది దుఃఖ రహిత జీవితం... దాని కొరకే ఎందరో మహానుభావులు యుగ యుగాలుగా ప్రచారాలు చేశారు,చేస్తున్నారు...అందరికీ అలాంటి జీవితాలు అందించాలని పత్రీజీ గురువు గారు ధ్యాన ప్రచారాలు విస్తృతంగా విలక్షణంగా చేశారు... ఆ మార్గంలో మనందరం ప్రయాణం కొన సాగించడమే వారి శిష్యులుగా వారికి ఇచ్చే అసలు సిసలైన "గురు దక్షిణ"
ఈ లోకంలో ఎవరైనా కోల్పోయిన పర్వాలేదు గాని నిన్ను మాత్రం నీవు కోల్పొరాదు నీ చుట్టూ ఉన్నవారి యొక్క మెప్పు, అభినందనల కోసం.
నమ్మించి మోసం చేసేవారిది ఎంత తప్పో గుడ్డిగా నమ్మి మోస పోయేవారిది కూడా అంతే తప్పు... ఆన్ని రంగాలతో పాటు అధ్యాత్మిక రంగంలో కూడా ఉంటారని ఎరుకతో గమనిస్తూ ఉండాలి.
ఎవరు ఎన్ని రకాల ప్రచారాలు, బోధనలు,ప్రవచనాలు చెప్పినా అందులో ముఖ్య పాత్ర దుఃఖ రహిత జీవితం గురించి మాత్రమే... ఆ జీవితం సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం అని తెలుసుకొండి.
పసుపుల పుల్లారావు, ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తెలంగాణా రాష్ట్రం
9849163616
No comments:
Post a Comment