: ఆ నాలుగు ~~
భక్తి, జ్ఞాన, శరణాగతి, &
వైరాగ్యములు
➖➖➖✍️
ఈ సృష్టిని చేసి, దానిని ఒక పద్ధతిగా నిర్వహించే ఒకానొక ‘మహా శక్తి’ ఉంది.
దాని పేరే పరమాత్మ!
పరమాత్మకు రూపం కానీ, నామము కాని లేవు, గుణం కూడా లేదు. ఏవైనా ఉన్నాయి అనుకుంటే అది మన కల్పన.
ఈ మహాశక్తికి మనం ‘శరణాగతి’ చెయ్యాలి.
అన్ని ఈ మహాశక్తికి నియమాలకు లోబడి నడుస్తున్నాయి.
మన వ్యక్తిగత అహంకారంతో వీటిని విభేదించి నడుచుకోవడం సరి అయిన విధానం కాదు.
దీనికి శిక్ష తప్పదు!
కాబట్టి మనం అహంకార నిర్ములన కావాలి అనుకుంటే దానికి చేయవలసినది, ‘శరణాగతి!’
విశ్వ నియమాలకు అనుగుణంగా, విశ్వఆలోచనలకు అనుగుణంగా _(Universal thought plan)_ మన వ్యక్తిగత ఆలోచనలు ఉండాలి. _(Individual thought plan)._
దీనినే _role playing_ అంటారు.
అహాంకారం నాశనం కావాలి అనుకున్నవారు తమలో ఈ మార్పు తెచ్చుకోవాలి!
ఈ విశ్వంలో ప్రతిదీ, మనతో సహా, “ఈ విశ్వ ప్రణాళికకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే", అన్న సత్యాన్ని మరువకూడదు.
ఇది శరణాగతి కి సంభందించిన అంశము.
ఇక పరమాత్మ(మాహాశక్తి)… ఈ సృష్టిని తనలోనుంచి సృష్టించిన మాయ సహకారంతో సృష్టించారు.
మాయని ప్రకృతి అని కూడా అంటారు.
ఈ ప్రకృతి పంచ భూతాలు, త్రిగుణాలలో ఉంటుంది.
మాయ స్వతహాగా జడము, కదలిక లేనిది.
కానీ మాయ నిత్యము మార్పుకు లోను కావాలి కాబట్టి కదలిక అవసరం.
ఎలా అయితే రైలు పెట్టెలు స్వయంగా కదలవో, తాను కదులుతూ వాటిని కదిపే ఇంజిన్ ఉందో,
అలా పరమాత్మ తాను సృష్టించినదానిలోకి ప్రవేశించి దానిలో కదలిక ఏర్పరిచి, కావాల్సిన మార్పులు తెస్తున్నారు.
సృష్టిలో పరమాత్మ ప్రవేశం ఒక ప్రతిబింబం లాగా ఉంటుంది.
అంటే ఆయన స్వయంగా స్థిరంగా ఒక చోట ఉండి (ఆ చోటును పరంధామం అని అంటాము, భగవద్గీతలో ఈ చోటుకి చేరినవారు తిరిగి జన్మ తీసుకోరు అన్నారు) ఈ సృష్టి లో ఉన్నారు.
ఎలాగైతే మిట్టమద్యాహ్నము సూర్యుడు భూమిమీద ఉన్న మట్టికుండలోని నీటిలో ప్రకాశిస్తున్నాడో, అలా ప్రతిబింబ రూపంలో అలా పరమాత్మ ఈ సృష్టి యావత్తు నందు ప్రతిబింబ రూపంలో ప్రకాశిస్తున్నాడు.
ఆయన అన్నిటి యందు సమముగా ఉన్నారు కాబట్టి ఈ సృష్టి లోని ప్రాణి కోటి యావత్తు సమానమే,
ఎవ్వరు ఎక్కువ కాదు, తక్కువ కాదు.
ఈ అవగాహనే జ్ఞానము.
అంటే పరమాత్మ నీలో, నాలో, అందరిలో సమముగా తిష్ట వేసుకొని ఉన్నాడు.
ఈ జ్ఞానమును విష్ణు తత్వము అంటారు. _Omnipresence, omnipotent_ అంటారు.
ఈ అవహాగనకి ఒక రూపము కల్పించి, ఆ రూపానికి అదే విష్ణు నామము జోడించి, ఆయనను వైకుంఠంలో ఉంచాము మనము అజ్ఞానంతో.
విశ్వవ్యాప్తి అయిన పరమాత్మ మనలో కూడా ఉన్నారు.
దీనిని స్వస్వరూపం అని అంటారు.
ఈ స్వస్వరూపమును ప్రేమించడము, ఆరాధించడం ‘భక్తి’ అంటారు.
ఈ స్వస్వరుపమును మరచి, బాహ్యంగా ఆయనకు ఆరాధన చేయడం…
ఇంట్లో దైవాన్ని మరచి ఊళ్ళో దైవాలకి ఉత్సవాలు చేసినట్టు,
లేదా…
ఇంట్లో ఉన్న భోజనాన్ని మరచి పక్కింటిలో భోజనం అడుక్కుంటునట్టు.
ఈ స్వస్వరూప అనుసంధానం భక్తి,
ఈ స్వరూపమునకి శరణాగతి చేయడం
"ఈశ్వర ప్రణీదానం",
ఈ స్వస్వరూపము పేరు…"ఓం".
(తస్య వాచక ప్రణవః అన్నారు).
ఓంకారనాదానుసంధానమే…,
నిజమైన ఆరాధన, నిజమైన ప్రార్థన.
ప్రారంభములో "ఓం"ని నెమ్మదిగా ఉచ్ఛరిస్తు, దీర్ఘ నెమ్మది అయిన శ్వాసతో అను సంధానం చేస్తూ ఆ "ఓంకారము" తనంతట తానుగా మనకి వినబడే దశకు చేరుకోవడం ఈ …ఓంకారనాదానుసంధాన గమ్యం!
ఇది భక్తి!
ఇక పరమాత్మ సృష్టించిన యావత్తూ మన జీవన సౌకర్యం కోసమే.
అంతే కాని అవి మనవి కావు,
మనం శాశ్వతంగా వీటితో మార్పు లేకుండా ఉండలేము.
ఈ అవగాహనే వైరాగ్యాము.
మనకి రాగము పంచభూతములతో ఏర్పడ్డ విషయములపై ఉంటుంది.
ఆ విషయములు శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన.
పంచభూతములతో ఏర్పడిన రూపం పట్ల రాగము ఉంటుంది.
రాగము ఉన్నచోట ద్వేషం కూడా ఉంటుంది.
ఈ రాగద్వేషాలని ‘సూక్ష శరీరం’ అంటాము.
ఈ సూక్ష శరీరం ఉన్నంత వరకు మనకి ముక్తి రాదు.
కాబట్టి వైరాగ్యం తప్పని సరి.
అహంకారము వల్ల బేధ దృష్టి ఏర్పడుతుంది.
ఇదే కారణం…. మనకి ముక్తి రాకపోవడానికి, లేదా బంధం ఏర్పడటానికి!
ఈ అహంకారమునకు విరుగుడు, ఈశ్వర శరణాగతి.
రాగ ద్వేషాలు మమకారనికి హేతువులు,
దీనికి విరుగుడు వైరాగ్యం!
ఇదండీ నిజమైన భక్తి, జ్ఞాన, శరణాగతి, వైరాగ్యములు.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
No comments:
Post a Comment