నేటి మంచి మాట.
చిన్న చిన్న తప్పులను సాకుగా చూపి బంధాలను, అనుబంధాలను ఎన్నడూ వదులుకోకండి. ఈ లోకంలో ఏ ఒక్కరూ పరిపూర్ణమైన వారు కాదు. ఏ ఒక్కరూ చిన్న చిన్న పొరబాట్లు లేనివారు కాదు. చివరగా అభిమానం, ఆప్యాయతలు మనిషిలోని చిన్న చిన్న తప్పుల కంటే చాలా గొప్పవి.
నీ గురించి నీకు తెలియాలంటే ప్రతిరోజూ హృదయమనే పలక మీద నువ్వు చేసే పనులు, నీ ఆలోచనలు, నీ మాటలు, నువ్వు వినే విషయాలు, నీ ఇష్టాలు, అయిష్టాలు, నీ బలాలు, బలహీనతలు, నీ కోరికలు, ఆశలు, నీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, నీ మంచి, చెడులు, నీ తప్పు, ఒప్పులు అన్నీ రాసుకో అర్థం చేసుకో.. సరిచేసుకో.. లోకాన్ని చూడు నీకు నువ్వే రాజు..!
గతమెంత బాగుంది. ఊటబావిలో చేదే కొద్దీ నీళ్ళూరినట్టు తవ్వినకొద్దీ కుప్పలు తెప్పలు జ్ఞాపకాలు.. తనివితీర నెమరు వేసుకోవడానికి జీవితం మొత్తానికి సరిపడా.. పుట్టిన ఊరు, చదివిన స్కూలు, నడిచిన పల్లెబాట, తిరగిరాని స్నేహితులు.. గుండెనిండా జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయిన బాల్యం.. బహుశా అక్కడే ఆగిపోయానేమో.. ఊరితో పాటు, నన్నూ వదిలేసి వచ్చేసానేమో..పట్నానికి, పెద్దరికానికీ..
ఉషోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment