Tuesday, December 20, 2022

ఈ ఇరవై ఆరూ దైవికంగా వస్తాయి. వీటితో మనిషికి నిర్మలమైన మనస్సు కలుగుతుంది.

 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🍁సుఖం విలువ🍁

కారం ఉంటేనే తీపి రుచి తెలుస్తుంది... కష్టం ఉంటేనే సుఖం విలువ తెలుస్తుంది... 

మనిషిలోని రాక్షస లక్షణాల గురించి తెలిస్తే... సద్గుణాల విలువ అర్థమవుతుంది. 

👉భగవద్గీతలోని పదహారో అధ్యాయం దీన్ని గురించే చర్చిస్తుంది. 

మనిషిలోనే నిబిడీకృతమైన ఈ వైరుధ్య గుణాలు అతనిలో సంఘర్షణకు కారణమవుతాయి. 

ఆరు అసుర గుణాలను, ఇరవై ఆరు దైవ గుణాల సాయంతో అణచివేసినప్పుడు హృదయం నిష్కల్మషమవుతుంది. మానవుడు మాధవుడవుతాడు...

👉👉👉భగవానుడు ముందు ఇరవై ఆరు దైవిక గుణాల సంపదను అభివర్ణించాడు.

🌿నిర్భయం, 
🌿పవిత్ర హృదయం, 
🌿జ్ఞానదృష్టి, 
🌿దాన గుణం, 
🌿ఇంద్రియ నిగ్రహం, 
🌿యజ్ఞభావంతో స్వధర్మాన్ని చిత్త శుద్ధితో నిర్వర్తించడం, 
🌿శాస్త్ర అధ్యయనం, 
🌿అహింస, 
🌿సత్యం, 
🌿అక్రోధం, 
🌿చిత్తశాంతి, 
🌿ఇతరుల దోషాలను ఎంచని లక్షణం, 
🌿అన్ని జీవులపై దయ, 
🌿విషయ వాసనలు లేకపోవడం, 
🌿మృదుత్వం, 
🌿అణకువ, 
🌿కాపట్యం లేకపోవడం, 
🌿చిత్త స్థైర్యం, 
🌿తేజస్సు, 
🌿క్షమ, 
🌿ధైర్యం, 
🌿బాహ్యంతర శుచి, 
🌿ద్రోహ గుణ లేకపోవడం, 
🌿దురభిమానానికి దూరంగా ఉండడం... 

ఈ ఇరవై ఆరూ దైవికంగా వస్తాయి. వీటితో మనిషికి నిర్మలమైన మనస్సు కలుగుతుంది.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment