*🚩🚩🚩🚩🚩🚩" "మీ"మాటల తీరు" ఎలా ఉండాలి?" ఎలా ఉంటే బాగుంటుంది!
❤️❤️❤️
👍సమర్పణ: Mazumdar Bangalore. 87925-86125.
🙏🙏🙏
🚩ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు సమయోచితంగా, సందర్భోచితంగా, భాషా దోషం, భావ దోషం లేకుండా స్పష్టంగా మాట్టాడే "ప్రజ్ఞను" సంతరించుకోవాలి.
🚩అది "అభ్యాసం " చేత ఆధ్యాత్మికం చేతనే వస్తుంది. అది ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుని తన చుట్టూ ఉన్నవారికి మీ మాట ద్వారా వారికి, తృప్తి, శాంతినివ్వాలి.
🚩"మాట " ఎంత శక్తిమంతమయినదంటే ‘‘కడుపున్ రంపపు కోత కోయునది గాకుండినన్’’ అంటారు.
🚩ఒక వ్యక్తిని తీసుకొచ్చి పడుకోబెట్టి అటు ఒకరు, ఇటు ఒకరు నిలబడి రంపంతో కోస్తున్నప్పుడు ఏర్పడే ,"గాయం" బాధ కన్నా ఒక "అనరాని మాట" అన్నప్పుడు ఆ వ్యక్తి జీవితాంతం అది గుర్తొచ్చినప్పుడల్లా పడే బాధ ఎక్కువ.
🚩రంపంతో కోసిన గాయం కొన్నాళ్ళ తరువాత మానిపోవచ్చు. కానీ అనరానిమాట తొందరపడి అంటే ఆ అవతలి వ్యక్తి పొందే బాధ ఎప్పటికీ పోదు. అది వర్ణనాతీతము.
🚩అందుకే " మాట" ఎంత గొప్పదో మాటని ఉపయోగించేటప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి.
🚩" మనం మాట్లాడిన మాట, వదిలిన బాణము, జరిగిపోయిన కాలము విలువ, వదులుకున్న అవకాశాలు, తిరిగి తెచ్చుకోలేము. అందుకే మాట్లాడేటప్పుడు, ఒకటికి రెండుసార్లు ఆలోచించి, మాట్లాడాలి.
🚩" 3 అంగుళాల నాలిక, 6 ఆరడుగుల మనిషి ని, బాధ పెట్టే టట్టు చేస్తుంది.
🚩" మనం మాట్లాడే తీరును బట్టి, ప్రాణము కాపాడుకోవచ్చు! అలాగే
మరొక విధంగా పరుషంగా మాట్లాడితే, ప్రాణాలు పోవచ్చు.
🚩" మాటలే మనిషికి శత్రువు. మాటలే మనిషికి స్నేహితుడు,
విచ్చుకునే మాట్లాడితే మిత్రుడు చుట్టూ ఉంటారు. ఆదుపు తప్పి , మాట్లాడితే శత్రువులు బాగా పెరుగుతారు. కాలక్షేపం కొరకు నేను మాట్లాడను.
ఎంతటి కష్ట ప్రసంగాలల్లో చెడు మాట్లాడను.
🚩" మీ మాట తీరు బాగుండాలి. " గుహ్యమైన " మాటతీరు ద్వారా పుణ్యం కూడా సంపాదించాలి , ఆనందం కూడా సంపాదించాలి.
🚩" మీకు ప్రియమైన మాటలు చెప్పేవారు సులభంగా దొరుకుతారు.
కానీ "అప్రియమైన " సరే సరైన విషయ పరిజ్ఞానముతో చెప్పే వారు నేడు చాలా "దుర్లభము".
🚩 " సొల్లు చెప్పే 100 మంది కన్నా, " సొల్యూషన్" ఒకడు చెప్పేవాడు మిన్న.
🚩 "మీరు ప్రేమతో, చిన్న చిరునవ్వుతో, ఆప్యాయంగా, ఉన్నది ఉన్నట్లు, పూర్తిగా విన్న తర్వాత, తెలివి గా, ఆలోచించి, మనసు విప్పి,
అర్థం చేసుకుంటూ, మాట్లాడటం అలవాటు చేసుకోండి!
🚩" ఇతరుల గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడవలసి వస్తే, " "మౌనం "వహించాలి.
🚩" నీకు అసలైన విషయం తెలియనప్పుడు " మధ్యలో వచ్చి మాట్లాడకు, మౌనం" వహించు.
🚩" నోరు జారిన "మాట" ఎగిరిపోయిన పక్షి లాంటిది. చెప్పవలసిన విషయం సూటిగా చెప్పలేని వారు "వాసనలేని పుష్పగుచ్చం" వంటి వారు.
🚩" మీ మాట్లాడే తీరు, మీ మాటలు చెబుతాయి మీ స్వభావం ఏమిటో?
🚩" మీ మాటకు మంచి విలువ" ఉండాలి అంటే ,నీ నాలుక ను నీ ఆధ్వర్యంలో ఉంచుకో!
🚩" మీ మనసులోని మాటను, ఏ భేషజాలు, హిపోక్రసీ, లేకుండా చెప్పాలి. మీ మాట కరెక్ట్ గా ఉన్న భావాలు ఆప్యాయంగా ఉండాలి సుమా!
🚩" నీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడే వారి గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే వారి స్థానం మీ వెనకే అని గుర్తించండి!
🚩" ఈ "నోటి మందబుద్ధి" నుండి "బుద్ధి వైకల్యం" గల మాటలు వద్దు. అసంబద్ధమైన అసలు మాటలు పనికిరావు.
🚩"కుప్త్తం గా, స్పష్టం గా మాట్లాడలేని వారు, ఎక్కువగా మాట్లాడుకు, మక్కువ చూపుతారు.
ప్రతి పదం ఆచి,తూచి మాట్లాడు. అర్థవంతమైన మాటలు మించిన "ధర్మం" ఎన్నడూ లేదు.
💐" మీ అందం కన్నా, మీ మాట తీరు ప్రధానము- తీయనైన మాటలతో కటిక విషము నైన అమ్మ వచ్చునేమో కానీ, కానీ కట్టుబడిన మాటలతో మీరు తేనె కూడా అమ్మలేరు. అని తెలుసుకోండి!
🥁" మన మాట మన సంపదకు మూలము.
ఆ సంపద ద్వారా మనము" మానవ సంబంధాలను" మెరుగుపరుచుకోవచ్చు.
🌹" మీరు మాట్లాడే మాటలకు శత్రువులు ఏర్పడతారు ( మీ మధ్య "దూరము "ఏర్పడును).,
అదే మీ మాటలకు స్నేహితులు ఏర్పడతారు
( మీ మధ్య "స్నేహ సంబంధాలు" మెరుగుపడతాయి)
☔" ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడండి! మీ ఇల్లు స్వర్గము అవుతుంది.
☂️" మీ కోపము హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానము చెప్పకండి! తాత్కాలిక మౌనము ప్రధానము.
💧" ఒక మనిషి మరొక మనిషికి గుర్తుంది పోయేలా చేసే విషయము మాట. మరి ఆ మాటను మనసుకు చేసే గాయములా చేయకండి.
🏵️" మీ మనసులో "కత్తులు" దాచుకొని ( తేనె పూసిన కత్తిలా) పైకి చిరునవ్వు నటిస్తూ, మాటలతో" పువ్వులు" రాల్చే, మనుషులుగా ఉండకండి.
🌼" మీ మాటలతో ఎదుటివారికి "విసుగు" రాకుండా చూడండి!
🚩" ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని,
పంతాలు, పట్టింపులు, కొట్లాటలు, తగాదాలు,
ప్రతీకారముల జోలికి పోకండి!
🕉️" మీ మాటలలోని చమత్కారమును మీ భాష ద్వారా " మీకు గల "భాషా పటుత్వాన్ని" రంగరించి తెలియపరిచిన
" హృదయ రంజకరము" గా మారును.
🛕" మీరు ఒక కవిగా స్పందించి, మాటే మంత్రములా" చమత్కార బాసు రంగా" ముచ్చటించండి.
❤️సమర్పణ & సేకరణ:
"Mazumdar Bangalor"
" ఇంక ఆలస్యము ఎందుకు? మీ మదిలో ఇంకా ఏమైనా, మాటలు గల" సన్మోహస్తాలను" ఉంటే తెలియజేయండి!
🚩🚩🚩🚩🚩🚩🚩
No comments:
Post a Comment