Saturday, December 17, 2022

మహామూలాశక్తి ని వ్యక్తిత్వము(అహం) అడిగిన అరుదైన ప్రశ్నలు.

 🦋🌸💜🦋💜🌸🦋

నీవు ఎవరు ?
మహాశూన్యశక్తిని

ఎక్కడ ఉన్నావు ?
అంతరం లో ఉన్నాను.

ఎలా ఉన్నావు?
ఉనికి గా ఉన్నాను.

ఎక్కడెక్కడ ఉన్నావు?
అంతటా,అన్నింటా ఉన్నాను.

నీ ఉనికి లో ఏముంది?
ప్రణవము ఉంది

నీ కదలిక ఏమిటి?
ప్రణవ కదలికే నా కదలిక

నీ బాష ఏమిటి?
ప్రణవం లోంచి ఉద్భవించే శబ్దము.

నీ శ్వాస ఎక్కడ నుంచి?
మూలమే నేను...
శ్వాసకు మూలమే నేను.

నీ నడక ఎక్కడికి?
నేను విస్తరించేవరకు....

నిన్ను దర్శించడం ఎలా?
నిన్ను నువ్వు కోల్పోయిన తక్షణం....నేను ను విడిచిన తరుణం.......

నీలో ఏమి ఉన్నాయి?
ఏమి లేని అన్ని ఉన్న స్థితి.

దూరంగా ఉన్నావా?
లేదు నీకు చాలా దగ్గరగా, నీలో ఉన్నాను.

నిన్ను ఏవిధం గా దర్శించాలి?
అనుభూతి ద్వారా...

నీలో దివ్యత్వము?
అంతా దివ్యత్వమే....
నీలో ఉన్న కారుణ్యజ్యోతి ని నీవు దర్శించిన తర్వాత నన్ను దర్శిస్తావు,దివ్యత్వాన్ని అనుభూతి చెందుతావు.

నీలో ఉన్నప్పుడు నాకు ఏమి లభిస్తాయి?
ఆనందం,బ్రహ్మానందం, పరమానందం,సఛ్చితానంద పారవశ్యం.

నిన్ను ఎలా పట్టుకుని దర్శించి తరించాలి?
మొదట నీ అంతరం లో చైతన్యాన్ని పట్టుకుని దర్శించి అనుభూతి చెంది ఆ తర్వాత అందరి చైతన్యాన్ని దర్శించి అనుభూతిలో తరించాలి.

నీవు ఎవరికి చెందింనదానివి?
అందరూ నాకు చెందినవాళ్ళే....

నీకు ఎన్ని సంవత్సరాలు?
"O".... అనగా శూన్యం....

ఆది అంతము ఎక్కడ?
ఆది ఆంతర్యము లేనివాడిని....
నీ ఆది నీ అంతము నీకు అనుభూతి లోనికి వచ్చిన తక్షణము నాకు ఆది అంతము లేదని గ్రహిస్తావు.

నీ నామము ఏమిటి?
మీ నామము వదిలితే నేను తెలుస్తుంది.

నీదగ్గరకు చేరాలంటే నాకు ఏ గుణములు ఉండాలి?
ప్రేమ,కారుణ్యము తో నీవు ఉన్నప్పుడు అదే గుణములు ఉన్న నాదగ్గరకు అతి సునాయాసంగా నీవు చేరుతావు.

చీకటి గా ఉంటావా?
వెలుగుకు మూలం గా ఉంటాను.

నీవు లేనిది ఏమిటి?
నేను లేనిది నీవు కూడా లేవు.

నీ దగ్గరకు ఎవరు ఎవరు వచ్చారు?
చాలా మంది యోగులు ....

కఠోర తపస్సు చెయ్యాలా?
నిన్ను నువ్వు వదిలించుకోవడమే కఠోర తపస్సు....

నువ్వు నా దగ్గర ఉన్నావా?
ఇప్పుడే,ఇక్కడే,నీ అంతరంలో....

కళ్ళుమూస్తే కనిపిస్తావా?
కళ్ళుమూస్తే అఖండ కోటివేలుగుల దివ్యజ్యోతి గా దర్శనమిస్తాను,కళ్ళు తెరిస్తే అనుభూతి గా ఉండిపోతాను.....

నేను ఎవరు?
నేను ను తీసిపాడై నేనే నీవని అవగతమవ్వుతుంది.

నీగురించి ఇంకా?
నేను అనే తొలుబొమ్మలను ఆడించే దివ్య శక్తిని ....

శక్తి,చైతన్యమా మీరు?
ఆ రెండు కలిపి నాలో ఉంటాయి.

నువ్వో నక్షత్ర బిందువా?
కాదు నక్షత్రాలు,అనంత విశ్వాలుకు కాంతి నేను.

నేను(వ్యక్తిత్వము) మూలం అనుకున్నాను?మరి ఎలా?
అది భ్రమ .అలా అనుకోవడం జన్మ జన్మల శ్రమ.

నీ(శూన్యం)స్థాయి ఏమిటి?
అన్ని స్థాయిలు నాలో కరిగిపోతాయి అదే నా స్థాయి.

మహామూలాశక్తి ని వ్యక్తిత్వము(అహం) అడిగిన అరుదైన ప్రశ్నలు.

🔥🙏🦋🌸💜🌸🦋🙏🔥

No comments:

Post a Comment