Wednesday, December 21, 2022

ఒక సినిమా విజయవంతం అవ్వాలంటే

 ఒక సినిమా విజయవంతం అవ్వాలంటే ఆ సినిమా డైరెక్టర్. ఆ సినిమా లోని
హీరో చుట్టూ హీరోని ఎంతో ఇబ్బంది పెట్టే
విలన్లను పెడతాడు హీరోకు మంచి పేరు రావాలంటే హీరో ప్రక్కన విలన్లు తప్పని సరి
నిజానికి హీరో , హీరో కాదు
విలన్ ,విలను కాదు 
సినిమా షూటింగ్ అయిపోయాక
ఇద్దరు మిత్రులే వారితో సినిమా షూటింగ్
చేసిన డైరెక్టర్ కూడ వారి మిత్రుడే

అదే విధంగా ఈ భూమండలం అనే ఈ సినిమా తెర ముందు 
మంచివారి ప్రక్కన చెడ్డ వారు లేక
పోతే మంచివారికి గుర్తింపు లేదు
ఈ చెడ్డ వారంతా మంచి వారికి
మంచివారు అనే గుర్తింపు తేవడం కోసం చెడ్డ వారు అనే నిందను తమ పై వేసుకుంటున్న దివ్యాత్మ స్వరూపులు   అని తెలుసుకోండి 

నిజంగా
ఈ భూమిని విడిచి వెళ్లి పోయాక
మంచివారు మంచివారు కాదు
చెడ్డవారు  చెడ్డ వారు కాదు ఇదంతా కూడ
ఆ పరమాత్ముడు అనే దర్శకేంద్రుని
దర్శకత్వమే అని తెలుసుకోండి అందుకే అన్నమయ్య గారు నానాటి బ్రతుకు నాటకము అన్నారు

No comments:

Post a Comment