Friday, December 16, 2022

 అరుణాచల👏
ఒకసారి ముగ్గురు విదేశీ స్త్రీలు స్వల్ప కాల సందర్శనము కొరకు  తిరువణ్ణామలై వచ్చారు,   న్యూజిలాండ్ నుంచి శ్రీమతి Hearst మరియు లండన్ నుంచి శ్రీమతి Craig మరియు  శ్రీమతి  Allison.    వారిలో ఒకరు మహర్షిని అడిగారు :    ప్రపంచ  శాంతి కొరకు చేయ తగ్గ ఉత్తమమైన పని ఏది ?

మహర్షి  :  ప్రపంచము ఏమిటి ?   శాంతి ఏమిటి ?   పని చేయువారు ఎవరు ?

ప్రపంచము నీవు నిద్ర పొయినప్పుడు లేదు,  అది జాగ్రత్ అవస్థలో మనసు చేత కల్పించ బడినది.   కావున అది ఒక భావన  తప్ప మరేమి కాదు.    
ఇంక శాంతి అంటారా అది అలజడి లేని స్టితి.   అలజడి వ్యక్తి యెక్క ఆలొచనల ద్వారా కలుగుచున్నది. 
ఈ వ్యక్తి ఎవరు అని విచారణ చేస్తే శుద్ధ చైతన్యములో నుంచి వచ్చిన  అహము ('నేను').
శాంతి అంటే ఆలొచనలు లేకుండా శుద్ధ చైతన్యముగా ఉండి పోవుటయే.    నీకు నీవు శాంతిగా ఉంటే అంతటా శాంతినే.

చాలామంది మైండ్‌ని మళ్లీ మైండ్‌తోనే కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. మన నాలికని మనం టేస్ట్ చెయ్యడానికి ప్రయత్నించడం లాంటిది అది. ఎప్పటికీ అది సాధ్యపడదు. 

మైండ్ పరిధి దాటిపోయి నిరంతరం సంతృప్తిగా నిండుకుండలా ఉన్నప్పుడు మాత్రమే మైండ్‌లో ఆలోచనలు తగ్గిపోతాయి. మీలోని అసంతృప్తి విపరీతమైన ఆలోచనలకు ప్రధాన కారణం. అసంతృప్తిని పెంచే ఏ అంశమైనా నేరుగా విషం తీసుకోవడంతో సమానం. అది మిమ్మల్ని సంతృప్తిగా, నిండుగా ఉండకుండా అడ్డుకుంటుంది.

- Sridhar Nallamothu. 

No comments:

Post a Comment