Thursday, January 5, 2023

*****మనశాంతి.....

 040123a1837.     050123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀729.
నేటి…

             *ఆచార్య సద్బోధన:*
                ➖➖➖✍️


*మనశాంతి.....*

*గాఢనిద్రలో వేటితోని పనిలేకుండానే మనశాంతి లభిస్తుంది, మెలకువలో అలా ఎందుకు సాధ్యం కావటంలేదు...???*

*గాఢనిద్రలో లభించే మనశాంతి మానవుని లోని ఆత్మతత్వానికి నిదర్శనం. *

*మనం మనశాంతిని, తృప్తిని సుఖసంతోషాల ద్వారా పొందాలని అనుకుంటాము.*

*అందుకే మనశాంతి కోసం వెతుక్కోవాల్సి వస్తోంది....*

*అనుకున్న పనులు చేయటం ద్వారా, శరీరాన్ని సుఖంగా ఉంచడం ద్వారా మాత్రమే మనశాంతి కలుగుతుందని మన భావన.*

*ఈరోజు మనం శరీరంతో అనుకున్నవి చేయగలిగినప్పుడు, మనసుతో ఇష్టమైన విషయాలు భావన చేయగలిగినప్పుడు కలిగే అనుభూతిని మనశాంతిగా భావిస్తున్నాము...*

*నిజానికి మనశాంతి, తృప్తి , ఇవన్నీ మనలోని ఆత్మ సుగుణాలు. శరీర క్రియలతో, మనోభావాలతో పనిలేకుండా అవి మన సొంతం.*

*పగలంతా అనేక శరీర క్రియలతో కష్టసుఖాలు అనుభవిస్తున్నాం. స్వప్నంలో దేహంతో పనిలేని అనేక మానసిక భావనలతో కూడిన సంతోష, దుఃఖాలను పొందుతున్నాం.*

*నేను దేహాన్ని కాదు, దేహిని అనే భావం మనలో కలిగాలి, ఎలాంటి పరిస్తులలో వున్నా నాది ఇది కాదు , నాదంటూ ఏమి లేదు అనే భావన రావాలి... అప్పుడే మనశాంతి కలుగుతుంది...*
*నిద్రలో అప్రయత్నంగా మనశాంతి పొందటానికి అదే కారణం...*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment