Thursday, January 12, 2023

✍🏻 స్వామీ వివేకానంద స్ఫూర్తి వచనాలు...

 _*✍🏻 స్వామీ వివేకానంద స్ఫూర్తి వచనాలు...*_

_*◆ రోజుకు ఒక్కసారైన మీతో మీరు మాట్లాడుకొండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.*_

_*◆ నీ వెనుక ఏముంది, ముందేముంది,  అనేది నీకనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం.*_

_*◆ మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.*_

_*◆ ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి.*_

_*◆ ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.*_

_*◆ విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు!!!*_

No comments:

Post a Comment